కామాంధుల అరాచకాలకు హద్దు, అదుపు లేకుండా పోతోంది. తమ కోర్కెలు తీర్చకపోయినా, తమకు అడ్డు చెప్పినా దారుణానికి తెగబడుతున్నారు. తమ కామ కోర్కెల కోసం ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి పెళ్లయిన మహిళపై కన్నేశాడు. ఆమెతో పొందుకోసం పరితపించాడు. అతడి పాడు బుద్ది తెలిసిన మహిళ ఇంటి వాళ్లు ఓ నిర్ణయానికి వచ్చారు. ఇకపై తమ ఇంటికి రావద్దని అతడితో చెప్పారు. ఆ మహిళ కూడా అతడ్ని దూరం పెట్టింది. దీంతో రెచ్చిపోయిన అతడు మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్‌లోని దిలౌరీ గ్రామానికి చెందిన షకీల్ అనే వ్యక్తి..
అదే గ్రామానికి చెందిన నీలమ్ యాదవ్ అనే వివాహితపై కన్నేశాడు. నీలమ్ ఇంట్లో వాళ్లతో ఉన్న పరిచయంతో తరచుగా ఆమె ఇంటికి వెళుతూ ఉండేవాడు. నీలమ్‌తో ఎంతో క్లోజ్‌గా మాడ్లాడుతూ ఉండేవాడు. కొద్దిరోజులకు షకీల్ పాడు బుద్ది నీలమ్ ఇంట్లో వాళ్లకు అర్థమైంది. దీంతో అతడ్ని ఇంటి దగ్గరకు రావద్దొని అన్నారు. నీలమ్‌ను కూడా షకీల్‌తో దూరంగా ఉండమని హెచ్చరించారు. ఇంట్లో వాళ్ల మాట ప్రకారం నీలమ్, షకీల్‌తో మాట్లాడటం మానేసింది. చాలా సార్లు అతడు ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. కానీ, ఆమె మాత్రం పట్టించుకోలేదు.
నీలమ్ ప్రవర్తనతో షకీల్లోని క్రూరుడు బయటకు వచ్చాడు. ఎలాగైనా నీలమ్‌ను చంపాలని నిశ్చయించుకున్నాడు. సరైన సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఈ నేపథ్యంలోనే మార్కెట్‌కు వెళ్లి ఇంటికి వస్తున్న నీలమ్‌పై కత్తితో దాడి చేశాడు. దాదాపు 25 సార్లు నరికేశాడు. తీవ్రగాయాలపాలైన ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఆమె కుటుంబసభ్యులు పిర్పైన్టీ పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న షకీల్ కోసం అన్వేషిస్తున్నారు.