భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చంద్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామానికి చెందిన పొర్రొళ్ల జగ్గారావు అనే యువకుడికి గతంలో పెళ్లైంది. ఇతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆటో నడపుకుంటూ తన జీవినాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు.
అయితే ఈ క్రమంలోనే జగ్గారావుకు మాయర అనుష అనే తొమ్మిదో తరగతి బాలికతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకి ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు కలుసుకోవటం, మాట్లాడుకోవటం చేస్తూ ఉండేవారు. ఒకరిని విడిచి ఒకరు విడిచి ఉండలేనంతగా మారిపోయారు. అయితే ఈ నేపథ్యంలోనే సోమవారం స్కూల్ కు వెళ్లిన అనుష జగ్గారావుతో పాటు అశ్వరావుపేటకు వెళ్లింది.
అయితే మంగళవారం ఇంతకుముందుకే వారు పురుగుల మందు తాగే కత్తగూడెం బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. దీంతో బస్సులో వారిద్దరూ వాంతులు చేసుకుంటుండడంతో కండక్టర్ స్పందించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వారు ప్రాణాలు విడిచారని డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంభికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై స్సందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.