crime news : తన జీవితాన్ని బుగ్గిపాలు చేసిందని ఆరోపిస్తూ ఓ రంగస్థల నటి జీవితాన్ని యాసిడ్ పాలు చేశాడు ఓ వ్యక్తి. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆమె ముఖంపై ఇద్దరు స్నేహితులతో కలిసి యాసిడ్ పోశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన దేవీ గతంలో బీఎమ్టీసీలో మేనేజర్‌గా పనిచేసేది. ఆ జాబ్ మానేసి రంగస్థల నటిగా స్థిరపడింది. మంచి మంచి నాటకాలతో పేరు సంపాదించుకుంది. మార్చి 18 మధ్యాహ్నం నందిని లేఔట్, గణేష్ బ్లాక్‌లోని తన ఇంటి ఆవరణలో నిద్రపోతోంది. ఈ నేపథ్యంలో రమేష్, స్వాతి, యోగేష్ అక్కడికి వచ్చారు. ఆమె ముఖంపై మూడుసార్లు యాసిడ్ పోశారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ దేవిని నగరంలోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ముఖంతో పాటు శరీరంలోని పలు అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. పోలీసులు యాసిడ్ దాడికి పాల్పడ్డ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురిని దేవితో పాటు నాటకాలు వేసేవారిగా గుర్తించారు. దేవి కారణంగా తన భార్యపిల్లలు తనుకు దూరం అయ్యారని రమేష్ పోలీసులకు తెలిపాడు. తన బాధను ప్రియురాలైన స్వాతికి చెప్పాడు. ఆ తర్వాత యోగేష్‌కు కూడా చెప్పాడు. యోగేష్ దాడి చేద్దామని ప్లాన్ ఇచ్చాడు. రూ.10 వేలు చెల్లించి యోగేష్ దగ్గరనుంచి రమేష్ యాసిడ్ కొనుక్కున్నాడు. ఆ తర్వాత ముగ్గురు వెళ్లి దాడికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : విషాదం: పెద్దలు ప్రేమ వద్దన్నారని..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.