ఆమె దుబాయ్‌లో ఉంటోంది. ప్రియుడ్ని చూడటానికి వీలు చిక్కినప్పుడల్లా దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చేది. కొద్దిరోజుల క్రితం కూడా ప్రియుడి కోసం బెంగళూరుకు వచ్చింది. అతడి ఫ్లాటులో ఉండగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
ఆమె ఓ ఎయిర్ హోస్టెస్.. దుబాయ్‌లో ఉద్యోగం.. లక్షల్లో జీతం. ఆదర్శ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న ఆమె జీవితం ఎంతో సాఫీగా సాగిపోతోంది. ఇద్దరూ ఉండేది వేరే వేరు దేశాల్లో. అర్చన వీలు చిక్కినప్పుడల్లా ప్రియుడి కోసం ఇండియా వస్తూ ఎన్నో అనుభవాలను మూట కట్టుకుంటూ గడుపుతోంది. కొద్ది రోజుల క్రితం కూడా ప్రియుడ్ని చూడటానికి దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చింది. పాపం ప్రియుడి అపార్ట్‌మెంట్‌లోని నాల్గవ అంతస్తు నుంచి కింద పడి చనిపోయింది. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల అర్చన దుబాయ్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తోంది. అర్చన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన ఆదర్శ్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఆదర్శ్ బెంగళూరులో పని చేస్తున్నాడు. దీంతో అర్చన, ఆదర్శ్ నిత్యం వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకునేవారు. తనకు వీలు చిక్కినప్పుడల్లా ఆమె దుబాయ్‌నుంచి బెంగళూరుకు వచ్చేది. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం ప్రియుడ్ని చూడటానికి ఆమె దుబాయ్‌నుంచి బెంగళూరుకు వచ్చింది. అయితే, ఏమైందో ఏమో తెలియదు కానీ, అర్చన.. ఆదర్శ్ ఉండే అపార్ట్‌మెంట్ నాల్గవ అంతస్తునుంచి కిందపడి చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అర్చన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అర్చనది ఆత్మహత్యా? లేక హత్య అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఆమె చనిపోయిన రోజు ఆదర్శ్ అదే ఫ్లాటులో ఉన్నాడని తేలింది. ఆదర్శ్, అర్చనను పైనుంచి కిందకు తోసే అవకాశం కూడా ఉందని పోలీసులు భావిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో, చుట్టు పక్కల ఉన్న సీసీటీవీల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రమాదవశాత్తు కూడా అర్చన పైనుంచి కిందపడిపోయి ఉండొచ్చని అనుకుంటున్నారు. అపార్ట్‌మెంట్‌లోని వారిని కూడా విచారిస్తున్నారు. మరి, ప్రియుడ్ని చూడటానికి దుబాయ్‌నుంచి బెంగళూరుకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న అర్చన విషాదాంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.