అతని పేరు అన్వర్. పెళ్లైన మహిళపై మనసు పడ్డాడు. ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. దీనికి మొదట్లో ఆ మహిళ వ్యతిరేకించినా తర్వాత సానుకూలంగా స్పందించి అతని ప్రేమకు ఓకే చెప్పింది. ఇక ఇటీవల ఓ రోజు రాత్రి ఏం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. కొందరు పెళ్లైన మహిళలు భర్తలకు తెలియకుండా మరో కుంపటిని ఏర్పరుచుకుంటున్నారు. ఇక అసలు విషయం బయటపడడంతో కట్టుకున్నవాడికి పాడె కడుతున్నారు. ఇదిలా ఉంటే ఓ యువకుడు పెళ్లైన మహిళలో ఎఫైర్ పెట్టుకుని చివరికి ప్రియురాలి సాయంతో ఆమె భర్తను దారుణంగా హత్య చేశాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. బెంగుళూరులోని మహదేవ్ పూరలో ప్రియా-ఉదయ్ కుమార్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. భర్త స్థానికంగా బైక్ మెకానిక్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా కొంత కాలం పాటు ఈ దంపతుల సంసారం బాగానే ముందుకు సాగింది. ఇదిలా ఉంటే.. భర్త ఉదయ్ కుమార్ తాగుడుకు బానిసయ్యాడు. అంతేకాకుండా రాత్రిళ్లు రోజూ తాగొస్తు భార్యను తీవ్ర హింసకు గురి చేసేవాడు. దీంతో పాటు స్థానికంగా రౌడీగా పేరు తెచ్చుకుని అందరితో గొడవలు పెట్టుకునేవాడు. ఈ క్రమంలోనే వీరి ఇంటి పక్కనే ఉన్న అన్వర్ అనే పెళ్లికాని కుర్రాడు.. ఉదయ్ కుమార్ భార్య ప్రియాపై మనసుపడ్డాడు. కొన్నాళ్ల నుంచి ఆమెను గమనిస్తూ ఉండేవాడు.
ఇక కొంత కాలం తర్వాత అన్వర్.. నిన్ను ప్రేమిస్తున్నానంటూ ప్రియాకు వివరించాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. నాకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పింది. అయినా వెనక్కి తగ్గని ఆ యువకుడు.. ఆమె వెంటే పడ్డాడు. మొత్తానికి ప్రియా అన్వర్ ప్రేమను అర్థం చేసుకుని అతడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. దీంతో ఇద్దరు సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ రొమాన్స్ ను పిండుకునేవారు. ఈ క్రమంలోనే అన్వర్ ప్రియా భర్త ఉదయ్ కుమార్ ను హత్య చేయాలని అనుకున్నాడు. దీనికి అతని భార్య ప్రియా కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఇందులో భాగంగానే అన్వర్ తన ప్రియురాలి వద్ద ఉదయ్ కుమార్ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు.
అయితే అన్వర్ ఇటీవల ఓ రోజు రాత్రి ఉదయ్ కుమార్ షాపు సమీపంలో ఓ చోటుకు బైక్ పై వెళ్లాడు. అక్కడికి వెళ్లి ఉదయ్ కుమార్ కు ఫోన్ చేసి.. నా బైక్ పాడైందని తొందరగా రావాలంటూ చెప్పాడు. దీనికి సరేనన్న ఉదయ్ కుమార్.. నిజమే అనుకుని అన్వర్ ఉన్న చోటుకు వెళ్లాడు. తాగొచ్చి ప్రియాను వేధిస్తున్నావంటా ఎందుకు అని అన్వర్ ఉదయ్ కుమార్ ను ప్రశ్నించాడు. దీనికి కోపంతో ఊగిపోయిన ఉదయ్ కుమార్.. అసలు నీకేం సంబంధం అంటూ అతనితో గొడవకు దిగాడు. ఇదే విషయంపై ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు.
ఇక ప్లాన్ ప్రకారమే.. అన్వర్ తన వెంట తీసుకెళ్లిన కత్తితో ఉదయ్ కుమార్ ను పొడిచి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఉదయ్ కుమార్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టగా అతడిని చంపింది మృతుడి భార్య, అతని ప్రియుడు అన్వర్ అని తేలింది. దీంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.