AP Crime: కరోనా లాక్‌డౌన్ తర్వాతినుంచి జనం పోలీసుల మీద తిరగబడ్డం ఎక్కువయింది. చిన్న చిన్న విషయాలకు కూడా జనం పోలీసులపై విరుచుకుపడుతున్నారు. మరికొందరు తప్పు చేసి కూడా పోలీసుల మీదకు గొడవకు దిగుతున్నారు. తాజాగా, ఓ వ్యక్తి తన కారును ఆపినందుకు ట్రాఫిక్ పోలీస్‌పై దాడికి దిగాడు. బూతులు తిడుతూ కొట్టాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి కారులో రోడ్డుపై వేగంగా వెళుతున్నాడు.
కారు అతి వేగంగా వెళుతోందని గుర్తించిన ట్రాఫిక్ పోలీస్ ఒకరు సంతోష్ కారును ఆపారు. ట్రాఫిక్ పోలీస్ తన కారును ఆపటంతో సంతోషం ఆగ్రహానికి గురయ్యాడు. ‘నా కారునే ఆపుతావా!’ అంటూ దాడికి దిగాడు. పిడి గుద్దులతో విరుచుకుపడ్డాడు. ట్రాఫిక్ పోలీస్‌కు కోపం రావటంతో ఆయన కూడా ఎదురు దాడికి దిగారు. కొద్దిసేపటి తర్వాత గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Hyderabad: పడక సుఖానికి అలవాటు పడ్డాడు.. మహిళ చేసిన పనికి జైలు పాలయ్యాడు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.