నర్సమ్మ అనే మహిళ పొదుపు సంఘం లీడర్ గా వ్యవహరిస్తుంది. ఈ మహిళ పొదుపు చేసిన రూ.50 వేల నగదును తీసుకుని జమ చేసేదేందుకు ఇటీవల బ్యాంక్ కు వెళ్లింది. అయితే బ్యాంకులోకి వచ్చిన ఓ దొంగ నర్సమ్మ వద్ద డబ్బులు ఉన్నాయని గమనించాడు. ఇక వెంటనే అటు ఇటు చూసిన ఆ దొంగ నర్సమ్మ చేతిలో ఉన్న డబ్బును ఎత్తుకెళ్లాడు. దీంతో అలెర్ట్ అయిన ఆ ముసలవ్వ పరుగెడుతున్న ఆ దొంగను వెంటాడి మరీ పట్టుకుంది. అనంతరం ఆ దొంగను పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ ముసలవ్వ ఎలా పోరాడి అతడిని పట్టుకుందనే పూర్తి వివరాలు కింద తెలుసుకోండి.
అది మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ మండలం ఎదులాబాద్. ఇదే గ్రామానికి చెందిన నర్సమ్మ అనే వృద్ధురాలు డ్వాక్రా సంఘం లీడర్ గా వ్యవహరిస్తుంది. అయితే సంఘంలోని సభ్యులు అంతా ఇటీవల రూ.50 వేలు జమ చేశారు. ఇక ఆ మొత్తం డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ఇటీవల నర్సమ్మ ఘట్ కేసర్ లో ఉన్న ఓ బ్యాంకుకు వెళ్లింది. నర్సమ్మ బ్యాంకులో ఓ చోట కూర్చుని డబ్బును లెక్కబెడుతూ ఉంది. ఇదే సమయంలో ఆ బ్యాంకులోకి ఓ దొంగ ఎంటరయ్యాడు. నర్సమ్మ డబ్బులు లెక్కబెట్టడం చూసిన అతగాడు.. ఎలాగైన ఆ వృద్ధురాలి వద్ద డబ్బును దొంగిలించాలనుకున్నాడు.
ఇందులో భాగంగానే ఆ యువకుడు మెల్లగా ఆమె వద్దకు వెళ్లి డబ్బును లాక్కెళ్లాడు. దీంతో వెంటనే స్పందించిన ఆ ముసలవ్వ వెంటాడి మరీ అతడిని పట్టుకుంది. ఇదంతా గమనించిన బ్యాంకులోని జనాలు ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ది చేశారు. ఆ తర్వాత కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ దొంగను పట్టించారు. అయితే ఈ ఘటనలో నర్సమ్మ సాహసాన్ని పోలీసులు, స్థానికులు మెచ్చుకుంటున్నారు. అనంతరం పోలీసులు ఆ దొంగను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనలో వృద్ధురాలైన నర్సమ్మ పోరాట పటిమపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.