నేటి కాలం యువత రోడ్డుపై అడ్డు అదుపు లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తోటి వాహనదారులకు ఇబ్బందులను కలగజేస్తుంటారు. వీటిపై నగర పోలీసులు సైతం ఓ నిఘా ఉంచి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది వాహనదారులు హెల్మెట్, లైసెన్స్, ఆర్సీ లాంటివి లేని సమయంలో చలాన్లు పడకూడదని భావించి ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా అడ్డదారుల్లో వెళ్లేందుకు అనేక మార్గాలు వెతుకుతుంటారు.
మరీ ముఖ్యంగా వాహనాల నెంబర్ ప్లేట్ లో స్టిక్కర్స్ తీసేయడం, వెనకాల నుంచి కాళ్లు పెట్టడం వంటివి చేస్తూ పోలీసులకు దొరకుండా అక్కడి నుంచి చెక్కేస్తుంటారు. రోడ్డుపై ఇప్పటికీ ఎంతో మంది ఇలా ప్రవర్తిస్తుంటారు. అయితే ఇలాంటి అడ్డదారుల్లో వెళ్లే వాహనదారులకు హైదరాబాద్ నగర పోలీసులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై పోలీసులు నిఘా ఉంచి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: కళ్లు చెదిరే డిస్కౌంట్ తో చికెన్ అమ్మకం.. అసలు విషయం తెలుసుకుని ఖంగుతిన్న పోలీసులు.!
ఇంతటితో ఆగకుండా ఛార్జీషీట్ దాఖలు చేసి వారి వాహనాలను సైతం స్వాధీనం చేసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇలా చలాన్లు పడకుండా అతితెలివి ప్రయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమైన నగర పోలీసులు నిర్ణయంపై మీ అభిప్రాయాను కామెంట్ రూపంలో తెలియజేయండి.