అతనో పోలీస్ ఆఫీసర్. సమాజంలో ఉన్నతమైన హోదాలో ఉంటూ ప్రజలకు రక్షణగా, తప్పు ఒప్పులను సరిచేయాల్సింది పోయి అతనే ఎవరూ ఊహించని తప్పు చేశాడు. అభం, శుభం తెలియని ఓ స్కూల్ విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఏకంగా స్కూల్ నుంచే తీసుకెళ్లిపోయాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా మారింది. అసలు ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది ఉత్తర్ ప్రదేశ్ లిఖింపూర్ పరిధిలోని ఖేరిఫలియా ప్రాంతం. ఇక్కడే జోగేంద్ర సింగ్ అనే వ్యక్తి పోలీస్ డిపార్ట్ మెంట్ లో సబ్-ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇతగాడు గత కొంత కాలం నుంచి లక్నోలో చదువుకుంటున్న స్కూల్ అమ్మాయిపై కన్నేశాడు. ఎలాగైన ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఆ బాలికతో ఎప్పటి నుంచో మాటలు కలిపాడు. ఇదిలా ఉంటే ఆ బాలిక డిసెంబర్ 9న తాను ఉంటున్న హాస్టల్ నుంచి ఇంటికి చేరింది. తల్లిదండ్రులతో కొన్నిరోజులు గడిపిన ఆ అమ్మాయి డిసెంబర్ 12 మళ్లీ తిరిగి తన హాస్టల్ కు చేరుకుంది. ఈ క్రమంలోనే ఆ పోలీస్ ఆఫీసర్ ఆ బాలిక ఉంటున్న హాస్టల్ కు చేరుకున్నాడు. ఆ తర్వాత హాస్టల్ సిబ్బందికి మాయమాటలు చెప్పి ఆ బాలికను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు.
ఇక ఎందుకో హాస్టల్ సిబ్బందికి అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆ బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే ఆ బాలిక తల్లిదండ్రులు మాయమాటలు చెప్పి మా కూతురుని తీసుకెళ్లిపోయాడని లక్నోలోని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. స్కూల్ బాలికను తీసుకెళ్లిపోయిన ఈ పోలీస్ ఆఫీసర్ తీరుపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Reports of a police sub-inspector having eloped with a school girl in Uttar Pradesh’s #Lakhimpur Kheri district has sent shock waves in the area.
Jogendra Singh, posted as the chowki in-charge in Palia, is alleged to have eloped with the girl two days ago.@Uppolice pic.twitter.com/cdrOzcDHJn
— IANS (@ians_india) December 28, 2022