'అదానీగ్రూప్ vs వివాదాలు' ఈ వ్యవహారం ఇప్పటిలో సద్దుమనిగేలా కనిపించటం లేదు. ఒకటి పోతే మరొకటి అదానీ గ్రూప్ మెడకు ఉచ్చు బిగిస్తున్నాయి. ఇప్పటికే.. అమెరికన్ రీసర్చ్ సంస్థ ''హిండెన్‌బర్గ్' వెల్లడించిన నివేదికల ధాటికి లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయాన వికీపీడియా ఆరోపణలు మరోసారి తలనొప్పిగా మారాయి. వికీపీడియాను అదానీ గ్రూప్ తమకు అనుకూలంగా మార్చుకుందన్నది ప్రధాన ఆరోపణ.
మనకు తెలియని ఏ విషయంపైనా సమగ్ర సమాచారం కావాలంటే ముందుగా గుర్తొచ్చేది.. ‘వికీపీడియా’. ఇంటర్నెట్ ఆన్ చేసి గూగుల్ లో శోధించగానే మనకు తెలియని ఆ విషయ పూర్తి సమాచారాన్ని వికీపీడియా మన ముందు ఉంచుతుంది. అలాంటి వికీపీడియా పేజీలనే తమకు అనుకూలంగా అదానీ గ్రూప్ మార్చుకుందన్నది తాజా ఆరోపణ. ఈ మేరకు వికీపీడియా ఆన్‌లైన్ న్యూస్‌పేపర్ ‘ది సైన్‌పోస్ట్’ కథనాన్ని వెలువరించగా, ఆ నివేదికలను ‘హిండెన్‌బర్గ్’ అధిపతి నాథే అండర్సన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ దెబ్బతో అదానీ గ్రూప్ పరువు మరోసారి మంటల్లో కలిసిపోయింది. అంతేకాదు.. పతనమైన షేర్లు ఇప్పుడిపుడే కోలుకుంటున్న సమయాన మరోసారి నష్టాల బాట పట్టాయి.
గౌతమ్ అదానీ గురించి వికీపీడియాలో 2007 తొలిసారి కథనాలు మొదలయ్యాయని, మొదట్లో అవన్నీ తటస్థంగా ఉండేవని వికీపీడియా తెలిపింది. అయితే, హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్ విలువలు పడిపోవడం, ప్రపంచం ద్రుష్టి అదానిపై పడటం, అదానీ గ్రూప్‌నకు సంబంధించి వికీపీడియాలో శోధనలు పెరగడంతో.. సమాచారాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారన్నది సైన్ పోస్ట్ కథనం. గౌతమ్ అదానీ, గ్రూప్ కంపెనీలకు సంబంధించిన సమాచారంతో పాటు అదానీ కుటుంబ సభ్యుల విషయంలోనూ సమాచారాన్ని చొప్పించారని విమర్శించింది. అందుకోసం 40కి పైగా సాక్ పప్పెట్ అకౌంట్లను (ఖాతా ఒకరిది, నియంత్రించేది మరొకరు) ఉపయోగించిందని, పెయిడ్ ఎడిటర్లతో కథనాలు రాయించుకున్నట్టు వెల్లడించింది.
ప్రధానంగా గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్, ప్రీతి అదానీ (అదానీ సతీమణి), కరణ్ అదానీ (అదానీ కొడుకు), ప్రణవ్ అదానీ (అదానీ అల్లుడు), అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ తదితర పేర్లతో ఉన్న ఆర్టికల్స్‌ను మ్యానిప్యులేట్ చేసినట్టు వికీపీడియా వార్త పత్రిక ‘ది సైన్‌పోస్ట్ కథనాన్ని వెల్లడించింది. ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. ‘హిండెన్‌బర్గ్’ నివేదిక నేపథ్యంలోనే అదానీ గ్రూప్ ఈ సవరణలకు పాల్పడిందన్నది విశ్లేషకులు చెప్తున్న మాట. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలోతెలియజేయండి.
Of all things—now the Signpost, Wikipedia’s independent newspaper, is out w/ an article showing how Adani systematically manipulated its Wikipedia entries using sock puppet accounts, undisclosed paid editors & removing evidence of conflicts of interest.https://t.co/s7Yzw8rXys pic.twitter.com/UVG6dVWtfu
— Nate Anderson (@ClarityToast) February 20, 2023