2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా మహిళల సంక్షేమం కోసం ‘మహిళా సమ్మాన్ బచత్ పత్ర‘ యోజనను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇది వన్ టైమ్ చిన్న మొత్తాల పొదుపు పథకం. ఇది రెండేళ్ళ కాలానికి అంటే.. 2025 వరకు అందుబాటులో ఉంటుంది. దీనిపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే, ఇందులో ఉన్న మరో ముఖ్యమైన వెసులుబాటు ఏంటంటే.. పాక్షికంగా సొమ్మును ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. ఇది మహిళలకు మంచి పథకమనే చెప్పాలి.
కేంద్ర బడ్జెట్ 2023-24లో మహిళల కోసం తీసుకొచ్చిన ఏకైక పథకం.. ‘మహిళా సమ్మాన్ బచత్ పత్ర’ అనే చెప్పాలి. ఈ పథకం గురుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసే ముందు.. మహిళల సంక్షేమం కోసమే ఈ సేవింగ్ సర్టిఫికెట్ పథకాన్ని తీసుకొచ్చామని వెల్లడించారు. ఇందులో మహిళలు గరిష్టంగా రూ. 2 లక్షల డిపాజిట్ చేయవచ్చు. పొదుపుపై 7.5% వడ్డీ లభిస్తుంది. ఈ పథకం మార్చి 2025 వరకు అందుబాటులో ఉంటుంది. పైగా ఇందులో డిపాజిట్ చేసిన డబ్బుపై ఎలాంటి పన్ను ఉండదు. అలాగే, అత్యవసర సమయాల్లో కొంతమేర డబ్బును ఉపసంహరించుకోవచ్చు.
ఉదాహరణకు.. మీ ఆదాయం ఏడాదికి రూ. 9 లక్షలు ఉంటే, మీరు దానిపై పన్ను చెల్లించాలి. కానీ, మీరు ఆ రూ. 9 లక్షలలో రూ. 2 లక్షలు మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజనలో డిపాజిట్ చేస్తే.. ఆ డబ్బును ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు పెట్టుబడిగా చూపి పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే.. రూ. 2 లక్షలకు మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలినరూ.7 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు ఉన్న కారణంగా మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఇలా పన్ను నుంచి తప్పించుకునే వెసులుబాటు ఉంది.
#UnionBudget2023 #AmritKaalBudget
Azadi Ka Amrit Mahotsav Mahila Samman Bachat Patra@diprjk @infjammu @OfficeOfLGJandK @Divcomjammu @districtadmkat1 @CBCKathua @CBCJammuKashmir @PIBSrinagar @Jammu_SmartCity @jakfinance @MyGovJandK @FinMinIndia @ddiprjammu @airkathua pic.twitter.com/IbANux0bC9— Information & PR, Kathua (@DiprKathua) February 1, 2023