2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా మహిళల సంక్షేమం కోసం ‘మహిళా సమ్మాన్ బచత్ పత్ర‘ యోజనను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇది వన్ టైమ్ చిన్న మొత్తాల పొదుపు పథకం. ఇది రెండేళ్ళ కాలానికి అంటే.. 2025 వరకు అందుబాటులో ఉంటుంది. దీనిపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే, ఇందులో ఉన్న మరో ముఖ్యమైన వెసులుబాటు ఏంటంటే.. పాక్షికంగా సొమ్మును ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. […]