పసిడి ప్రియులకు శుభవార్త. మరోసారి బంగారం ధరలు తగ్గాయి. నిన్నటి మీద పోలిస్తే ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా పరిశీలిస్తే బంగారం, వెండి ధరలు అనేక సార్లు తగ్గుతూ వచ్చాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుండడం, బలమైన ఆర్థిక డేటా గణాంకాలు వంటి వాటి వల్ల ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచేందుకు మొగ్గు చూపుతుంది. దీని వల్ల డాలర్ పుంజుకుని.. బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఒక ఔన్సు వద్ద ఇవాళ ఉదయం 8 గంటల సమయానికి 1842.87 డాలర్లు ఉండగా.. ఔన్సు వెండి ధర రూ. 21.77 డాలర్లకు చేరుకుంది. దేశీయంగా కూడా బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. దేశంలోనో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి.
ఇవాళ ఫిబ్రవరి 21న బంగారం ధరలు ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తే.. నిన్నటి మీద ఇవాళ 10 గ్రాముల బంగారం వద్ద రూ. 100 తగ్గింది. వెండి ధర కూడా కిలో వద్ద రూ. 100 తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ. 52,350 ఉండగా.. ఇవాళ రూ. 52,250 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 57,100 ఉండగా.. ఇవాళ రూ. 57,000 ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 100 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 120 తగ్గింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ. 52,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,600 ఉంది. నిన్నటి మీద రూ. 110 తగ్గింది.
ఇక హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,100 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,830 ఉంది. చెన్నైతో పోలిస్తే హైదరాబాద్ లో 10 గ్రాముల వద్ద రూ. 120 తగ్గింది. నిన్న ఇదే బంగారం 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 56,950 ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,830 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,100 ఉంది. ఇక కిలో వెండి ధర ఢిల్లీలో ఇవాళ రూ. 68,500 పలుకుతోంది. నిన్న రూ. 68,600 ఉండగా.. 100 తగ్గింది.
అలానే హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ నగరాల్లో కిలో వెండి ధర రూ. 71,700 ఉంది. నిన్న రూ. 71,800 ఉంది. ఇంకా ఈ ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచితే మరోసారి బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతాయని అంటున్నారు. అయితే ఈ ధరలు ప్రస్తుతం తాత్కాలికంగానే తగ్గుతాయని.. కానీ రానున్న రోజుల్లో రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి బంగారం, వెండి ధరలు తగ్గడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.