గోల్డ్ ప్రియులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. గత నెలరోజుల నుండి తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఆడవారికి బంగారం అన్న చాలా మక్కువ. ఎన్ని నగలు ఉన్నా ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది. చాలా వరకు మహిళలు బంగారంను పొదుపు చేస్తుంటారు. ఈ రోజుల్లో పురుషులు కూడా తమ స్టేటస్ చూపించుకోవడానికి గోల్డ్‌ను వినియోగిస్తున్నారు. ప్రతి శుభకార్యాలలో బంగారం లేదా వెండి ఐటమ్స్ ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. గిఫ్ట్ రూపంలో కూడా గోల్డ్ లేదా వెండి వస్తువులను అందిస్తారు. బంగారం శుభ సూచకం కాబట్టి ప్రతి కార్యంలో ఉపయోగిసుంటారు. సంప్రదాయబద్దంగా కొన్ని వస్తువులను తప్పనిసరిగా తీసుకుని వాటిని శుభకార్యాలలో ఉపయోగిస్తారు.
ఇంటర్నేషనల్ మార్కెట్ లో ప్రతికూల సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో గోల్డ్ రేట్లు వరుసగా పతనమైన విషయం తెలిసిందే. గత నెల రోజుల నుండి దాదాపు రెండు వేల రూపాయల వరకు బంగారం ధర తగ్గుతూ వస్తుంది. వెండి రేట్లు కూడా కిలోకు రూ.80వేల నుండి రూ. 75 వేల వరరకు దిగింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు స్వల్పంగా పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1925 డాలర్లపైన కొనసాగుతుంది. స్పాట్ సిల్వర్ రేటు 23 డాలర్లపైకి చేరింది. ఇది గమనించదగ్గ విషయం. ఈ సమయంలో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రూ. 82.683 వద్ద కొనసాగుతుంది. దేశీయ మార్కెట్లలో కూడా బంగారం, వెండి రేట్లు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరిగి ప్రస్తుతం రూ. 54,500 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 440 పెరిగి రూ. 59,510 మార్కు వద్ద ట్రేడవుతోంది.
ఇక వెండి విషయానికి వస్తే గతంలో భారీగా తగ్గి ప్రస్తుతం వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.హైదరాబాద్ లో నిన్న రూ.1000 పెరిగి కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ. 76,700 కి చేరుకుంది. బంగారం, వెండి ధరలు ఆయా ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఆయా ప్రాంతీలలో ఉండే పన్ను రేట్లనుబట్టి ప్రభావితమవుతాయి.