బంగారం, వెండి కొనడానికి ఇది తగిన సమయమా? కాదా? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు తగ్గేదేలే అన్నట్లు రికార్డ్ స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. ఎంసీఎక్స్ లో గత నెలా 15 రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు 9 నెలల గరిష్టానికి పెరిగాయి. అంటే ఫిబ్రవరి 2023 నుంచి అక్టోబర్ 2023 వరకూ బంగారం, వెండి ధరలు పెరుగుతాయి తప్ప తగ్గే అవకాశం లేదని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 55 వేల మార్కు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం బంగారం నిన్నటితో పోల్చుకుంటే తగ్గింది.
డిసెంబర్ 12 సాయంత్రం 05.15 నిమిషాలకి ఎంసీఎక్స్ లో స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సు 1795.35 యూఎస్ డాలర్లుగా ఉంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఒక గ్రాము ధర రూ. 4764.15 గా ఉంది. అంటే 10 గ్రాముల బంగారం ధర రూ. 47,641.50 గా ఉంది. ఇక వెండి ధర చూస్తే.. ఒక ఔన్సు 23.51 యూఎస్ డాలర్లుగా ఉంది. భారతీయ కరెన్సీ ప్రకారం కిలో వెండి ధర రూ. 62,278.47 గా ఉంది. బంగారంతో పోల్చుకుంటే.. వెండి ధర ఇవాళ బాగా పెరుగుతుంది. ఇవాళ మార్కెట్ లో 24 క్యారెట్లు ఉన్న 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ. 54,490 ఉండగా.. హైదరాబాద్ లో రూ. 54,330 గా ఉంది. నిన్న 24 క్యారెట్ల బంగారం ధరలు చూసుకుంటే.. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం రూ. 50,050 గా ఉండగా.. హైదరాబాద్ లో రూ. 54,440 గా ఉంది.
నిన్నటితో పోల్చుకుంటే గ్రాము దగ్గర బంగారం ధర రూ. 11 తగ్గింది. 10 గ్రాములకు రూ. 110 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే.. ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల బంగారం ధర రూ. 49,950 ఉంటే.. హైదరాబాద్ లో రూ. 49,800 గా ఉంది. నిన్న ఢిల్లీలో ఇదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,050 ఉండగా.. హైదరాబాద్ లో 49,900 గా ఉంది. 10 గ్రాములకి నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ. 100 తగ్గింది. గత 10 రోజుల్లో రూ. 1000 కి పైగా పెరిగిన బంగారం ధర ఇవాళ మాత్రం 10 గ్రాముల దగ్గర రూ. 100 తగ్గింది. ఇక మార్కెట్ లో వెండి ధర విషయానికి వస్తే ఒక గ్రాము వెండి ధర ఢిల్లీలో రూ. 69 ఉండగా.. హైదరాబాద్ లో రూ. 72.80 గా ఉంది. నిన్న గ్రాము వెండి ధర ఢిల్లీలో రూ. 68.10 ఉండగా.. హైదరాబాద్ లో రూ. 73 గా ఉంది.
నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ గ్రాము మీద హైదరాబాద్ లో 20 పైసలు తగ్గింది. ప్రస్తుతం వెండి ధర హైదరాబాద్ లో కిలో రూ. 72,800 ఉంది. నిన్న ఇదే కిలో వెండి ధర రూ. 73,000 ఉంది. కిలో వెండి మీద రూ. 200 తగ్గింది. గత నాలుగు రోజుల లెక్కన చూసుకుంటే.. 4 రోజుల్లో ఏకంగా రూ. 2200 మేరకు పెరిగింది. నిన్న రూ. 500 పెరిగి 73 వేల మార్కుకు చేరుకుంది. ఇవాళ రూ. 200 తగ్గినా గానీ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. బంగారం, వెండి ధరలు ప్రాంతాలను బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. స్థానిక పన్నుల ఆధారంగా స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటాయని తెలిసిందే. అయితే యూఎస్ ఫెడ్ సమావేశం ఈ నెల 13, 14 తేదీల్లో జరగనుంది.
దీంతో వడ్డీ రేట్ల పెంపులో తేడా ఎలా ఉంటుందో అని తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా ఆర్బీఐ గతంలో కంటే తక్కువగా 35 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెంచింది. దీంతో యూఎస్ ఫెడ్ కూస వడ్డీ రేట్ల పెంపు విషయంలో నెమ్మదిగా వ్యవహరిస్తుందన్న సంకేతాలు వస్తున్నాయి. మరి రేపు, ఎల్లుండి జరగబోయే సమావేశంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి చూడాలి.