అప్పుడప్పుడే ఉనికిని చాటుకుంటున్న ఓటీటీ రంగానికి కరోనా మహమ్మారి రాక ప్రాణం పోసిందనే చెప్పాలి. ఆనాటి నుంచి తిరుగులేని శక్తిగా ఓటీటీల ప్రయాణం సాగుతోంది. ఎవరి స్మార్ట్ ఫోన్ లో చూసినా, కనీసం మూడు ఓటీటీ యాప్ లయినా ఉంటున్నాయి. పోనీ, ఆ సర్వీసులు ఉచితమా? అంటే అదీ కాదు.. నెల నెలా వందలు పెట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. వీటికే బోలెడంత డబ్బులవుతోంది. ఈ క్రమంలో ప్రముఖ డీటీహెచ్ సంస్థ టాటా ప్లే అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. ‘టాటా ప్లే బింజ్’ పేరుతో రూ.299కే 17 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. ఆ వివరాలు..
టాటా ప్లే అందిస్తోన్న ‘టాటా ప్లే బింజ్’ కాంబో ప్యాక్ లో 17 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉంటాయి. డిస్నీ+హాట్ స్టార్, సోనీ లైవ్, వూట్ సెలెక్ట్ వంటి టాప్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా ఉన్నాయి. వీటి యాక్సిస్ కోసం నెలకు రూ. రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే.. రూ. 59 ప్యాక్ కూడా మంచి ప్లాన్ అని చెప్పాలి. కేవలం రూ. 59తో పలు ఓటీటీల సబ్‌స్క్రిప్షన్లు లభిస్తున్నాయి.
టాటా ప్లే అందిస్తోన్న 17 ఓటీటీల లిస్ట్:
డిస్నీ+హాట్ స్టార్, జీ5, సోనీ లైవ్, వూట్ సెలెక్ట్, MX Player, hoichoi, Chaupal, Namma Flix, Planet Marathi, Sun NXT, హంగామా ప్లే, ఎరోస్ నౌ, ShemarooMe, Voot Kids, క్యూరియాసిటీ స్ట్రీమ్, ఎపిక్ ఆన్, DocuBay.
కాకుంటే.. టాటా ప్లే బింజ్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందడానికి, వినియోగదారులు మొదటగా Amazon Fire TV Stick Tata Play Binge+ STB/Tata Play ఎడిషన్‌ను కలిగి ఉండాలి. దీంతోపాటు టీవీలోని కంటెంట్‌ను వీక్షించడానికి యాక్టివ్ DTH ప్యాక్ కలిగి ఉండాలి. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.