పెట్టుబడి రూ.50 వేలు.. ఆదాయం రూ.20 కోట్లు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అసలు ఈ పోటీ ప్రపంచంలో లక్షల్లో ప్రారంభిస్తున్న వ్యాపారాల్లో లాభాలు రాక ఎదరుచూస్తుంటే రూ.50 పెట్టుబడితో ప్రారంభించిన ఓ ప్రయత్నంలో రూ.20 కోట్లకు ఎలా చేరిందనే కదా మీ ప్రశ్న. ఓ యువ పారశ్రామికవేత్తలు వేసిన వీరి అడుగులో ఎన్నో ఒడిదుడుకులు, నిందలు ఉన్నాయట. ఇక వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని పూడ్చటానికి ఏకంగా ఇళ్లును కూడా అమ్మారట. అంతటి నష్టాల్లో ఉన్న వీరి వ్యాపారం అన్ని కోట్లకు ఎలా చేరిందో తెలియాలంటే వీరి సక్సెస్ స్టోరీ చదవాల్సిందే.
ఆమె పేరు దీప్తి. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ చేసి సిఎ కోసం సన్నాహాలు చేసుకుంది. చదువు పట్ల ఇంట్రెస్ట్ లేకపోయినా సీఎ చివరి సంవత్సరం పూర్తి కావొస్తుంది. అయితే ఈ తరుణంలోనే దీప్తీ వేసిన అడుగు తన జీవితాన్నే పూర్తిగా మార్చి వేసింది. 24 ఏళ్ల దీప్తీ వేరొకరి భాగస్వామ్యంతో ఈ ఈవెంట్ వ్యాపారంలో చేరింది. ఇక 31 డిసెంబర్ 2014 న ఢిల్లీలో జరిగిన అతిపెద్ద ఈవెంట్ బాధ్యత దీప్తి కంపెనీకే లభించటం విశేషం. ఆ ఈవెంట్‌కి చాలామంది ప్రముఖులు హాజరు కావలసి ఉంది. కానీ ఈ కార్యక్రమం జరగడానికి ముందు స్పాన్సర్లు చేతులు ఎత్తే ఈవెంట్ భాగస్వామి కూడా వెళ్ళిపోయాడు.
ఈ దెబ్బకు ఈవెంట్‌కి టిక్కెట్లు పెద్దగా అమ్ముడు పోలేదు. దీంతో అప్పుడు నా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిపోయింది. ఏం చేయాలో అర్థంకాక ఆ సమయంలో చనిపోవడమా, పారిపోవడమా లాంటి పరిస్థితి ఎదురొచ్చింది. ఇక నా సొంత డబ్బును పెట్టుబడి పెట్టి ఏదో ఒకవిధంగా ఈవెంట్‌ను నిర్వహించాను. మళ్లీ దాదాపు 40 లక్షల రూపాయల నష్టం. ఈ అప్పును పూడ్చటానికి మా ఇంటిని కూడా అమ్మాల్సిన దరిద్రమైన సమయం వచ్చింది. దీంతో రోడ్డున పడ్డ మేము కొన్నేళ్లు అద్దె ఇంట్లో ఉంటుండగా అందరూ మా అమ్మానాన్నతో పాటు నాపై అనేక నిందలు వేశారు. ఆ సమయంలోనే అమ్మనాన్న కోరిక మేరకు వికాస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకకున్నాను. నా కలల గురించి తెలుసుకుని, నన్ను మళ్ళీ వ్యాపారం చేయమని ప్రోత్సహించటం మొదలు పెట్టాడు. 2016లో రూ.50 వేలతో డిజిటల్ హోర్డింగ్ అనే వ్యాపారాన్ని ప్రారంభించాను.
ఇది కూాడా చదవండి: ఇండియాకు వరల్డ్ కప్ సాధించిన బ్లైండ్ కపిల్ దేవ్ కన్నీటి గాథ!
మార్కెటింగ్, అకౌంటింగ్‌లో నాకున్న పరిజ్ఞానం బాగా కలిసొచ్చింది. దీంతో నా వ్యాపారం విజయాల బాటలో నడిచి కేవలం రెండేళ్ళలోనే మా సంస్థ 12 కోట్ల టర్నోవర్ సాధించింది. దీంతో మళ్లీ మేము ఊపిరి పీల్చుకున్నాము. ఇక ఇది ప్రతీ యేటా పెరుగుతూ ప్రస్తుతం మా కంపెనీ టర్నోవర్ నేడు రూ .20 కోట్లకు చేరింది. అంటూ తెలిపింది యువ పారిశ్రామిక వేత్త దీప్తీ. దీప్తీ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.