ఇంధన ధరలు మొదలుకొని నిత్యవసర వస్తువుల వరకు ప్రతి దాని ధర పెరుగుతుంది. దీంతో సామాన్యలు ఆర్ధికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల గ్యాస్ ధరలు కూడా భారీ స్థాయిలో పెరిగటంతో మధ్యతరగతి కుటుంబాలకు గ్యాస్ గుదిబండగా మారింది. అయితే తాజాగా గ్యాస్ సిలిండ్ రేటు తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో సిలిండర్ ధర భారీగా తగ్గింది. ఈ తగ్గిన రేట్ల నిర్ణయం జూలై 1 నుంచి అమలులోకి రానుంది. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రమే ప్రస్తుతం తగ్గింది. ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.198 తగ్గించింది. 14.2 కేజీల గ్యాస్ రేటు మాత్రం యధావిధిగా ఉన్నాయి. వాటి ధరలో ఎలాంటి మార్పులేదు. గతంలో ఏ ధర అయితే ఉందో.. అదే కొనసాగుతోంది.
కొత్తగా తగ్గిన ధరల ప్రకారం.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లు మెట్రోనగరాల్లో ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో రూ. 2021గా ఉంది. కోల్‌కతాలో ఈ సిలిండర్ కొనాలంటే రూ. 2140 చెల్లించుకోవాలి. ముంబైలో అయితే ఈ సిలిండర్ ధర రూ. 1981 వద్ద ఉంది. చెన్నైలో ఈ సిలిండర్ రేటు రూ. 2186గా ఉంది. జూన్ నెలలో కూడా స్వల్పంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. జూన్ లో రూ. 135 మేర దిగి వచ్చింది. మరొక వైపు డొమెస్టిక్ సిలిండర్ ధరలు అలానే ఉన్నాయి. మే నెలలో డొమెస్టిక్ సిలిండర్ ధర రెండు సార్లు పెరిగింది. మొదటగా మే 7న సిలిండర్ ధర రూ. 50 పైకి చేరింది. అలాగే మే 29 సిలిండర్ రేటు మళ్లీ రూ. 4 మేర పెరిగింది. ఇలా రెండు సార్లు ధరలు పెరిగాయి. గత ఏడాది కాలంలో డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 834 నుంచి రూ. 1003కు చేరింది.
చివరిగా మే 19న డొమెస్టిక్ సిలిండర్ ధర పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్ సిలిండర్ బుక్ చేయాలంటే రూ. 1060 వరకు చెల్లించుకోవాలి. ప్రస్తుతం అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటూ తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Reliance Jio: రిలయన్స్ జియో బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ముఖేశ్ అంబానీ! కొత్త చైర్మన్ గా..