బిజినెస్ చేయాలన్నదే మీ ఆలోచనా..! ఏ బిజినెస్ చేయాలో అర్థమవ్వడం లేదా! వ్యాపారం ప్రారంభించాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలనే ఆలోచనలో ఉన్నారా! ఐతే ఈ కథనం మీకోసమే. బిజినెస్ అనగానే మొదట ఎక్కువ పెట్టుఅబ్ది అవసరమేమో అన్న భావాను కొట్టిపడేయండి. మీ ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా మొదట తక్కువ పెట్టుబడితో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి. అదే మీకు దారి చూపుతుంది.
మీరు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? ఏదైనా కొత్తగా బిజినెస్ చేయాలని ఉందా..? అయితే మీకు మంచి ఆదాయాన్నిచ్చే ఒక మంచి బిజినెస్ ఐడియా మా వద్ద ఉంది. ఇంట్లో ఖాళీగా ఉండేవారు ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే నెలకు రూ. 20వేలకు పైగా సంపాదించవచ్చు. పైగా ఈవ్యాపారంలో నష్టాల గురుంచి బెంగ లేదు.. ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. మీకు తీరిక ఉన్న సమయంలోనే ఈ బిజినెస్ చేస్తూ.. నెలనెలా ఆదాయం పొందవచ్చు. ఏంటా బిజినెస్..? ఎలా ప్రారంభించాలి.. అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
ఏ అకేషన్ వచ్చినా.. ఏ పండగొచ్చినా.. ఆఖరికి మీ ఇంట్లో పిల్లల పుట్టినరోజు వచ్చినా ‘కేక్’ కోయాల్సిందే. దానినే మీ వ్యాపారంగా ఎందుకు మలుచుకోకూడదు. ఏ సందర్బం వచ్చినా కేక్ కోయడం అన్నది ఈ రోజుల్లో సాధారణమైపోయింది. వేలకు వేలు వెచ్చించి మరీ మూడు నుంచి నాలుగు కేజీల కేక్ తీసుకెళ్లి.. కట్ చేసి సెలెబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. దీన్నే మీ వ్యాపారానికి ఐడియాగా మలుచుకోండి. కేక్ కావాలంటే బేకరీకి వెళ్లాలన్నా రోజులు ఎప్పుడో పోయాయి.. ట్రెండ్ మారింది. అన్నీ ఆన్‌లైన్‌లోనే దొరికేస్తున్నాయి. ఏ వస్తువు కావాలన్నా.. ఆన్‌లైన్‌లో వెతకడం.. ఆర్డర్ ఇవ్వటం.. ఇంటికి తెప్పించుకోవటం.. ఇదే ట్రెండ్.
కేక్ ఎలా తయారుచేయాలో నేర్చుకుంటే.. ఇంట్లోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. లక్షలకు లక్షలు వెచ్చించి బేకరీలు పెట్టక్కర్లేదు. మీరు నున్న ఇంటిలోనే ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారానికి కావాల్సింది పెద్ద మొత్తంలో పెట్టుబడి కాదు.. వినూత్న ఆలోచనలు.. రకరకాల కేకులు తయారుచేయగలగడం. అవే మిమ్మల్ని ఈ వ్యాపారంలో పైస్థాయికి చేరుస్తాయి. నగరంలో చాలా మంది మహిళలు ఆన్‌లైన్ బేకరీ బిజినెస్ నడుపుతున్నారు. రూ. 4 వేలు ఖర్చుపెట్టి సొంతగా ఒక వెబ్ సైట్ క్రియేట్ చేసుకోవటం.. వారికొచ్చిన కేకులు తయారు చేసి వాటి ఫోటోలు అందులో ఉంచటం. ఇవి చాలవనుకుంటే.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా్గ్రామ్, ట్విట్టర్ పేజ్ లలో అకౌంట్లు క్రియేట్ చేసి వాటి ద్వారా నలుగురికి తెలియజేయటం. అందరూ చేస్తున్నది ఇదే. మీరూ ఇదే చేయండి.
కాలం మారింది.. మీలో కూడా మార్పు రావాలి. అందరూ ప్రతి వస్తువును ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు.. డోర్ డెలివరీ కోరుకుంటున్నారు. కావున అందుకు తగ్గట్టుగా ఆలోచన చేయండి. ముందుగా కేక్ ఎలా తయారచేయాలో నేర్చుకోండి.. వినూత్నంగా, నలుగురికి మెచ్చేలా కేక్ ఎలా తయారుచేయాలో శోధించండి. ఆపై మీ బిజినెస్ ఐడియాకు సరికొత్త నేమ్ జోడించి.. ఒక వెబ్ సైట్ క్రియేట్ చేసుకోండి.. ఇవి చాలవనుకుంటే.. ట్విట్టర్, పేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ పేజ్ లలో మీ వ్యాపారానికి సంబంధించి ఖాతాలను తెరవండి.. నలుగురికి తెలిసేలా చేయండి.
ఈ వ్యాపారంలో ఎలాంటి నష్టం వాటిల్లదు. ఎందుకంటే.. మీరు ఉంచిన ఫోటోలు అవతలి వారికి నచ్చి ఆర్డర్ ఇస్తారు. ఆ తరువాత మీకు కేక్ తయారుచేయడానికి కొంచెం సమయం ఉంటుంది. కావున బేకరీల వలే ముందే తయారుచేసి పెట్టక్కర్లేదు.. పడేయక్కర్లేదు. కాస్త టేస్టీగా, ప్యాకింగ్ అక్సార్షణీయంగా కనపడితే అవతలి వారికీ మీరు నచ్చినట్లే. ఒకసారి నలుగురు మీ కేకులను మెచ్చుకున్నారంటే.. వారి ఫీడ్ బ్యాకే మీ వ్యాపారానికి మొదటి పునాది. ఆర్డర్లు పెరుగుతాయి.. మంచి లాభాలు చవి చూస్తారు. ఇకపై ఆలస్యం చేయకండి. ఈ వ్యాపారం గురుంచి మరింత సమాచారం కావాలంటే గూగుల్ లో శోధించండి. కేక్ తయారీ నేర్చుకొని వ్యాపారం ప్రారంభించండి. ఈ వ్యాపారంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.