ప్రస్తుతం ఇంధన ధరలు మండిపోతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.110గా ఉండగా.. డీజిల్ లీటర్ ధర రూ.98గా ఉంది. టూ వీలర్స్ సంగతి అటుంచితే.. కారు బయటకు తీస్తే చాలు జేబుకు భారీగా చిల్లు పడాల్సిందే. అందుకే ఎలక్ట్రిక్ వెహికిల్స్ కార్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. అయితే కరెంటు బండి కొనాలంటే మాత్రం ఎక్కువ ధర చెల్లించాల్సిందే. పెట్రో-ఎలక్ట్రిక్ వాహనాల ధరల్లో చాలా తేడా ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో హైడ్రోజన్‌తో నడిచే కార్లు మార్కెట్లోకి రానున్నాయి. సరసమైన ధరతో ఎక్కువ మైలేజీ ఇచ్చేలా ఈ కార్లను పలు ఆటోమొబైల్ కంపెనీలు తయారు చేస్తున్నాయి.
తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఎంజీ మోటార్ ఇండియా ఓ హైడ్రోజన్ కారును ఆట్ ఎక్స్‌పో 2023లో ప్రదర్శించింది. ఎంజీ యునిక్ 7గా పిలుస్తున్న ఈ కారుకు సంబంధించి ఆటో ఎక్స్‌పోలో ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ మోడళ్లను కంపెనీ లాంచ్ చేసింది. ఇప్పుడు యునిక్ 7 హైడ్రోజన్ కారును ఆవిష్కరించింది. ఫుల్ సైడ్ ఎంపీవీగా దీన్ని డిజైన్ చేసింది ఎంజీ మోటార్స్. దాదాపు 5 మీటర్ల పొడవు ఉన్న కారు, 2 మీటర్ల వెడల్పు ఉంది. దీనికి ఇరు వైపుల స్లైడింగ్ డోర్స్ ఉన్నాయి. కారు లోపల ప్రీమియం మెటీరియల్ తో సీట్లను తయారు చేశారు. ఇందులో డిజిటల్ డిస్‌ప్లే, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మెమరీ ఫంక్షన్స్, వెంటిలేషన్ లాంటి ఎన్నో ఫీచర్ల్ ఉన్నాయి. మరి, మంచి మైలేజీతోపాటు డ్యూయెల్ సన్‌రూఫ్ లాంటి ఎన్నో స్పెషల్ ఫీచర్లు కలిగిన ఈ కారు గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MG Euniq 7 is just now unveiled by MG Motor India!
It’s a hydrogen fuel cell electric vehicle in India and has a range of about 605 km.
As per the company, H2O (water) is the only byproduct emitted. pic.twitter.com/jh1Zuqoiox— Jen 🍷 (@DsouzaJennifer) January 12, 2023