మీరు పన్ను చెల్లించారా? ఐతే మీకు కొంత డబ్బు రిఫండ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ కోటి మందికి పైగా పన్ను చెల్లింపులదారుల ఖాతాల్లో డబ్బులు క్రెడిట్ అయ్యాయి. మరి మీకు కూడా అర్హత ఉందో లేదో ఇలా తెలుసుకోండి.
ఆదాయ పన్ను రిటర్న్స్ ని ఫైల్ చేయడానికి ఎక్కువ సమయం లేని కారణంగా ప్రతి రోజూ రికార్డ్ స్థాయిలో ఐటీఆర్ లు నమోదు అవుతున్నాయి. ఆదాయ పన్ను శాఖ పోర్టల్ లో ఉన్న డేటా ప్రకారం ఇప్పటివరకూ 11.31 కోట్ల మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు పోర్టల్ లో నమోదు చేసుకున్నారు. డేటా ప్రకారం 2023-24 అసెస్మెంట్ సంవత్సరంలో ఇప్పటి వరకూ 2.61 కోట్లకు పైగా ఆదాయ పన్ను రిటర్న్ లు దాఖలు చేయబడ్డాయి. వీరిలో 2.41 కోట్ల ఆదాయ పన్ను రిటర్న్ లను ఆదాయ పన్ను శాఖ ధృవీకరించింది. ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేయడంతోనే పని పూర్తయినట్టు కాదని దాన్ని ధ్రువీకరించడం కూడా అవసరమే అని ఐటీ శాఖ వెల్లడించింది.
ధ్రువీకరణ తర్వాత మాత్రమే ఆదాయ పెను రిటర్న్స్ ఫైల్ చేసే ప్రక్రియ పూర్తయినట్లుగా పరిగణించబడుతుందని పేర్కొంది. ఆ తర్వాతే ఆదాయ శాఖ ఐటీ రిటర్న్స్ ను ప్రాసెస్ చేస్తుందని తెలిపింది. రిటర్న్స్ లో ఉన్న మొత్తం సమాచారం సరైనదని నిర్ధారణ అయితే చెల్లింపుదారులు క్లెయిమ్ చేసిన రిఫండ్ అమౌంట్ పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ జమ చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది. ఆదాయ పన్ను శాఖ వారం రోజుల క్రితం ఐటీ రిటర్న్స్ ప్రక్రియను ప్రారంభించింది. పోర్టల్ లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఆదాయ పన్ను శాఖ ఇప్పటివరకూ 1.13 కోట్ల ధృవీకరించబడిన ఆదాయ పన్ను రిటర్న్స్ లను ప్రాసెస్ చేసింది.
ఐటీఆర్ అనేది ఏడాదికొకసారి దాఖలు చేసేది. ఆదాయపన్ను అనేది నెలవారీ జీతం ఎక్కడి నుంచి వస్తుందో ఆ సోర్స్ మీద బేస్ అయ్యి నెల నెలా కట్ అవుతూ ఉంటుంది. దీన్నే ట్యాక్స్ డిడక్టడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) అని అంటారు. ఆదాయ పన్ను స్లాబ్, సంవత్సర ఆదాయ అంచనాలను బట్టి జీతమిచ్చే సంస్థ చేత టీడీఎస్ లెక్కించబడుతుంది. అయితే ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ప్రక్రియలో మాత్రమే తుది పన్ను నిర్ధారించబడుతుంది. ఆ సమయంలో ఏడాదిలో మీరు చెల్లించవలసిన పన్ను బాధ్యత కంటే కూడా మీరు టీడీఎస్ ద్వారా ఏడాది పాటు కట్టిన పన్ను ఎక్కువగా ఉంటే అదనంగా కట్టిన పన్ను డబ్బు రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అదే టీడీఎస్ కంటే చెల్లించవలసిన పన్ను బాధ్యత ఎక్కువగా ఉంటే మాత్రం ఆ వ్యత్యాస పన్నును చెల్లించవలసి ఉంటుంది.
ఈ రిఫండ్ డబుల్లో ఎక్కువ భాగం అర్హత కలిగిన పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లో జమ చేసింది. మీరు కూడా ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేసి ఉంటే కనుక అర్హులైతే మీ ఖాతాల్లో కూడా రిఫండ్ మనీ పడతాయి. రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత ధృవీకరణకు వారం రోజులు పడుతుంది. రిటర్న్స్ ప్రాసెస్ చేసిన 1 నుంచి 2 రోజులలో డబ్బు పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లో క్రెడిట్ అవుతుంది. పన్ను చెల్లింపుదారులు చెల్లించాల్సిన దాని కంటే ఎక్కువ చెల్లిస్తే తిరిగి అదనపు అమౌంట్ ని ఐటీ శాఖ రిఫండ్ చేస్తుంది. దీన్ని ఆదాయపన్ను రిఫండ్ లేదా ఐటీ రిఫండ్ అని అంటారు. మీరు కనుక చెల్లించాల్సిన దాని కంటే ఎక్కువ పన్ను చెల్లించినట్లైతే కనుక మీకు రిఫండ్ అనేది వస్తుంది. ఇప్పటివరకూ కోటి మందికి పైగా రిఫండ్ వచ్చింది. మీరు కూడా అర్హులో కాదో అనేది చెక్ చేసుకోండి.