100 సీసీ హోండా షైన్ బైక్ స్ల్పెండర్ కంటే తక్కువ ధరకు లభిస్తోంది. తాజాగా ఈ బైక్ ను మార్కెట్ లోకి విడుదల జేసింది హోండా కంపెనీ. కేవలం రూ. 64 వేలకే హోండా షైన్ బైక్ లభిస్తోంది. పూర్తి వివరాలు మీకోసం..
నేటి కాలంలో అడుగు బయటపెట్టాలి అంటే బైక్ స్టార్ట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఇంటికో బైక్ కంపల్సరీ ఉంటోంది. ఇక రాబోయే కాలంలో ఇంటికో బైక్ కాదు వ్యక్తికో బైక్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో.. బైక్ కంపెనీలు వినియోగదారులకు తగ్గట్లుగా తమ బైక్స్ డిజైన్స్ కానీ, మైలేజ్ కానీ, ధరలను కానీ సరికొత్తగా ఆవిష్కరిస్తూ.. ముందుకెళ్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో పోటీ దారులనుంచి వస్తున్న పోటీని అధిగమించాలి అంటే.. ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలను తీసుకొస్తూ.. పోవాలి. అప్పుడే వినియోగదారులను ఆకట్టుకోగలుగుతాయి కంపెనీలు. ఇక ప్రస్తుత బైక్స్ లల్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న కంపెనీ ఏదైనా ఉంది అంటే అది హీరో మెటోకార్ప్ అనే చెప్పాలి. ఈ కంపెనీ నుంచి వచ్చిన స్ప్లెండర్ 100 సీసీ బైక్ ను కొట్టే మరో బైక్ రాలేదనే చెప్పాలి. ఇక ఎన్నో కంపెనీలు స్ల్పెండర్ కు ధీటుగా కొన్ని బైక్స్ ను పరిచయం చేశాయి. కానీ అవి విజయవంతం కాలేదు. ఈ క్రమంలోనే హోండా కంపెనీ సరికొత్త బైక్ ను ప్రవేశపెట్టింది. అతి తక్కువ ధరకే ఆ బైక్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. మరి ఆ బైక్ గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్రస్తుతం మధ్యతరగతికి అందుబాటులో ఉన్న బైక్ కంపెనీ ఏదన్నా ఉంది అంటే అది హీరో కంపెనీ అనే చాలా మంది చెబుతారు. ఎందుకంటే? 100సీసీలో హీరో మెటోకార్ప్ నుంచి వచ్చిన స్ల్పెండర్ బైక్ ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఢిల్లీలో ఎక్స్ షోరూం ధర వచ్చేసి.. సుమారు 72 వేల నుంచి ప్రారంభం అవుతున్నాయి. అయితే ఏ కస్టమర్ అయినా బైక్ కొనాలి అంటే ముందుగా చూసేది మైలేజ్, ధర, మోడల్. ఇక ప్రస్తుతం తక్కువ బడ్జెట్ లో బైక్ కొనాలనే వారికి ఆశాకిరణంగా నిలిచింది హోండా కంపెనీ. ఈ కంపెనీ నుంచి 100సీసీ హోండా షైన్ బైక్ తాజాగా మార్కెట్ లోకి విడుదల అయ్యింది. బడ్జెట్ ధరలో, మంచి మైలేజ్ కావాలనుకునే వారికి ఇది ఓ ఆప్షన్ గా నిలువనుంది.
ఇక 100 సీసీ హోండా షైన్ బైక్ ధర వచ్చేసి స్ల్పెండర్ కంటే తక్కువ ధరకు లభిస్తోంది. దీని ధర రూ. 64, 900(ఎక్స్-షోరూమ్)కే లభించనుంది. ఇక ఎంట్రీ -లెవల్ కమ్యూటర్ సెగ్మెంట్ లో ఈ బైక్ ధర ఆసక్తిని రేపుతోంది. ఇక ధర విషయానికి వస్తే.. హోండా షైన్ 100సీసీ బైక్ చౌవకైన బైక్స్ లల్లో ఒకటిగా నిలవనుంది. ఇక ఈ బండికి సంబంధించిన అద్భుతమైన ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హోండా షైన్ 100సీసీ బైక్ 5 కలర్స్ లో మార్కెట్ లో లభించనుంది. HMSI షైన్ 100పై ప్రత్యేక ఆరు సంవత్సరాల వారంటీ ప్యాకేజీని కూడా అందిస్తోంది.
అత్యుత్తమైన మైలేజీతో పాటుగా స్ప్లెండర్ కంటే ఎక్కువ ఫీచర్లు కలిగి ఉంది హోండా షైన్. 100సీసీ ఇంజన్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ తో పాటు రానుంది. అదీకాక ఈక్వలౌజర్ తో కూడిన కాంబి-బ్రేక్ సిస్టమ్ ను కూడా దీనికి జోడించారు. ఎయిర్ కూల్డ్, 97.2సీసీ, సింగిల్ సిలిండర్ మోటార్ తో ఈ బైక్ వర్క్ చేస్తుంది. 4-స్పీడ్ స్థిరమైన మెష్ గేర్ బాక్స్ తో రానుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న హోండా షైన్ బైక్ మార్కెట్ లోకి రావడంతో.. పోటీదారులకు ఇక చుక్కలే అంటున్నారు నెటిజన్లు. మరి 100సీసీ బైక్ 64, 900లకే హోండా షైన్ కంపెనీ అందివ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
New 2W!@honda2wheelerin launches its all-new 100cc Honda Shine, targeted at the commuter bike segment.
Starting price: Rs.64K (ex-showroom)
Will be available in 5 color options
Offers 3 yr standard + 3 yr optional extended warranty) @businessline @honda2wheelers @siamindia pic.twitter.com/FIKzA2EQ6t— Balachandar G (@BalascribeG) March 15, 2023