Home Appliances: ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ కొనాలనుకునేవారికి శుభవార్త. త్వరలో వీటి ధరలు తగ్గబోతున్నాయని సమాచారం. విడి భాగాల ధరలు పెరగడం, ఇన్‌పుట్ ఖర్చులు భారం కావడంతో ఇటీవల కంపెనీలు ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ లాంటి అప్లయెన్సెస్ ధరల్ని పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇన్‌పుట్ ఖర్చులు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఫ్రిజ్‌లు, ఏసీలు, మైక్రోవేవ్‌లు, వాషింగ్ మెషీన్‌ల ధరలు త్వరలో తగ్గే అవకాశం ఉంది.
అప్పుడు 10 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగిన ధరల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాగి 21 శాతం, ఉక్కు 19 శాతం, అల్యూమినియం 36 శాతం చౌకగా లభిస్తోంది. ఇక, వీటిని ముడిసరుకుగా ఉపయోగించే వస్తువుల తయారీ ఖర్చు కూడా తగ్గతుంది. తయారీ ఖర్చు తగ్గితే.. అమ్మకపు ధరల్లో మార్పులు కచ్చితంగా వస్తాయి. అయితే, ఇది ఇప్పటికిప్పుడు జరిగిపోదు.
సెప్టెంబర్ తర్వాత పండుగ సీజన్‌లో తగ్గింపు ధరలతో వస్తువులను కొనుక్కునేందుకు అవకాశం ఉంటుంది. మరో వైపు వంట నూనె ధరలు కూడా తగ్గనున్నాయి. లీటర్‌పై రూ.10 తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వంట నూనెల తయారీ కంపెనీలను కోరింది. కంపెనీలు వారం రోజుల్లో ధరల్ని తగ్గించబోతున్నాయి. మరి, హోమ్ అప్లయెన్సెస్, వంట నూనెల ధరలు తగ్గటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : RBI: క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి అలర్ట్! జులై 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి..