అందరికీ భవిష్యత్ అంటే భయం, ఆలోచన మొదలయ్యాయి. అందుకే ఎర్లీగా పెట్టుబడులు మొదలు పెడుతున్నారు. కానీ, ఇప్పటికీ చాలా మంది నెలవారీ చిట్టీలనే తమ ప్రధాన పెట్టుబడిగా భావిస్తున్నారు. తద్వారా వచ్చే చిన్న మొత్తాల్లో లాభాలను చూసుకుని.. పెద్ద మొత్తాలను నష్టపోతున్నారు.
ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి పని చేస్తుంటారు. వారికి సాధ్యమైనంత వరకు ఎంతో కొంత సంపాదిస్తుంటారు. కానీ, సంపాదించినది మొత్తం నిత్యం ఖర్చులు చేసుకుంటే పోతే భవిష్యత్ అనేది అగమ్యగోచరంగా మారిపోతుంది. ఇంకొందరు భవిష్యత్ గురించి ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఏదొక దాంట్లో పెట్టుబడులు పెడుతుంటారు. కానీ, వాళ్లు రైట్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? వారి పెట్టుబడి విధానం ద్వారా నిజంగానే ప్రతిఫలాన్ని పొందుతున్నారా? అనే ప్రశ్నలకు సమాధానాలు చాలా మందికి తెలియదు. ఇంకొందరు అలా పెట్టుబడులు పెడితే నష్టపోతామనే భయంతో బ్యాంకుల్లో దాచుకుంటారు. అలా కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే మీరు ఈ చిన్న విధానాన్ని ఫాలో అయితే చిన్న చిన్న మొత్తాల పెట్టుబడులతో మీరు దాదాపు రూ.3 కోట్లు సేవ్ చేసుకోవచ్చు.
సాధారణంగా ఎక్కువ మంది వారి భవిష్యత్ అవసరాల కోసం డబ్బు ఆదా చేసుకుంటూ ఉంటారు. అది పిల్లల చదువు కోసం కావచ్చు, ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, రిటైర్మెంట్ తర్వాత భరోసా కోసం కావచ్చు అవసరం ఏదైనా సేవింగ్స్ చేసే అలవాటు కలిగి ఉంటారు. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లు సేవ్ చేసుకునేందుకు ఇప్పటికీ వాడే మొదటి పెట్టుబడి విధానం చిట్టీలు కట్టడం. నెలకు రూ.5 నుంచి రూ.10 వేల వరకు చిట్టీలు కట్టి డబ్బుని ఆదా చేస్తుంటారు. అలా వాళ్లు వేల రూపాయలతో మొదలు పెట్టి రూ.లక్షల వరకు ఆదా చేస్తుంటారు. కానీ, రూ.లక్షలపై దృష్టి పెట్టి వాళ్లు రూ.కోట్లు ఆదా చేసే అవకాశాన్ని కోల్పోతున్నారు.
మీరు లాంగ్ టర్మ్ గోల్స్ కోసం పెట్టుబడులు పెడుతుంటే కచ్చితంగా మూచ్యువల్ ఫండ్స్ ని ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మీరు దాదాపు 30 ఏళ్లు పెట్టుబడి పెట్టే ఓపిక ఉండాలి. మీ ఆదాయం పెరిగినప్పుడల్లా అందులో పెట్టే పెట్టుబడిని కూడా పెంచుకుంటూ ఉండాలి. అలా మీరు క్రమశిక్షణతో నెల నెలా రూ.10 పెట్టుబడి పెడుతూ ఉంటే మీరు అక్షరాలా రూ.3 కోట్లు పొందే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఎంచుకునే పెట్టుబడి విధానాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. పెట్టుబడి పెట్టే సమయంలో కచ్చితంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఎంత ఎర్లీగా మీ భవిష్యత్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తే అంత మంచి ప్రతిఫలాన్ని మీరు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ కింది వీడియో చూడండి.