బంగారం తగ్గినప్పుడు కొనుక్కోవాలి.. అవసరమైతే పెరిగినప్పుడు అమ్మేసుకోవాలి అని బంగారు బాబులు చెబుతుంటారు. బంగారం అమ్ముకునే ఆలోచన లేదు గానీ కొనే ఉద్దేశం ఉంది. ధర తగ్గితే చెప్పు కొంటాం అని అంటారా? అయితే బంగారం కొనడానికి ఇదే సరైన సమయం. మీ కోసమే బంగారం దిగొచ్చినట్టు ఉంది. ఇంకా తగ్గచ్చు, పెరగొచ్చు. ప్రస్తుతానికైతే గతంలో ఉన్న ధరలతో పోలిస్తే తక్కువగానే ఉంది. ఒకసారి బంగారం ధరలు చూడండి. గత 3 రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఇవాళ (ఫిబ్రవరి 6) 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర రూ. 100 తగ్గగా.. స్వచ్ఛమైన బంగారం రూ. 50 చొప్పున తగ్గింది. కిలో వెండి ధర అయితే రూ. 1800 మేర తగ్గింది.
కిలో వెండి ధర రూ. 1800 మేర తగ్గింది. ఫిబ్రవరి 2 వరకూ కిలో వెండి ధర రూ. 77,800 ఉండగా.. ఫిబ్రవరి 3న 76 వేలకు తగ్గింది. ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో కిలో వెండి ధర రూ. 74,200కు చేరుకుంది. ఇంకా ఇదే ధర కొనసాగే అవకాశం కనిపిస్తోంది. జనవరి 1న రూ. 74,300 ఉన్న కిలో వెండి ధర.. జనవరి 31 నాటికి రూ. 74,500 గా ఉంది. జనవరి 16న మాత్రం గరిష్టంగా కిలో వెండి ధర రూ. 75,800 పలికింది. జనవరి 20న కనిష్టంగా రూ. 72,100 పలికింది. ఆ తర్వాత భారీగా పెరిగింది. ఫిబ్రవరి 1న రూ. 1500, ఫిబ్రవరి 2న రూ. 1800కు పెరిగి.. ఇప్పుడు రూ. 1800కు తగ్గింది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకుంటే.. జనవరి 1న రూ. 50,600 ఉండగా.. 31న రూ. 52,500 ఉంది. జనవరి 26న గరిష్టంగా రూ. 53,100 ఉండగా.. జనవరి 2న కనిష్టంగా రూ. 50,450 పలికింది. ఫిబ్రవరి 1న 10 గ్రాముల బంగారం ధర రూ. 500 పెరిగింది. ఫిబ్రవరి 1న రూ. 53,000 ఉండగా.. ఫిబ్రవరి 2న రూ. 53,600 పలికింది. ఫిబ్రవరి 3న 500 తగ్గగా.. 4వ తేదీన రూ. 700 తగ్గింది. ఇవాళ (ఫిబ్రవరి 6) 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 5,240 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ. 52,400 ఉంది. గత రెండు రోజులతో పోలిస్తే బంగారం ధర 10 గ్రాముల దగ్గర రూ. 1200 తగ్గింది. మునుముందు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
24 క్యారెట్ల బంగారం విషయానికొస్తే.. జనవరి 1న 10 గ్రాముల ధర రూ. 55,200 ఉండగా.. జనవరి 31న రూ. 57,270 పలికింది. జనవరి 26న గరిష్టంగా రూ. 57,930 ఉండగా.. కనిష్టంగా జనవరి 2న రూ. 55,040 పలికింది. ఫిబ్రవరి 1న 10 గ్రాముల బంగారం ధర రూ. 57,820 ఉండగా.. ఫిబ్రవరి 2న రూ. 650 పెరుగుదలతో రూ. 58,470 గా ఉంది. ఫిబ్రవరి 3న 10 గ్రాముల దగ్గర రూ. 540 తగ్గగా.. ఫిబ్రవరి 4న రూ. 770 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,160 గా ఉంది. గ్రాము బంగారం ధర రూ. 5,716 గా ఉంది. మునుముందు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ ధరలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకేలా ఉన్నాయి. ఇక బిస్కెట్ బంగారం ధర 3 రోజుల్లో రూ. 1300 మేర తగ్గింది. బంగారం, వెండి, ప్లాటినం సహా అనేక ఆభరణాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి ధరలు పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం అనేక రంగాలపై పడింది. ఈ ప్రభావం వల్ల బంగారం, వెండి వంటి ఆభరణాల ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు వివిధ బంగారు ఆభరణాల మార్కెట్ లో హెచ్చుతగ్గులు అనేవి ఉండవచ్చు. అయితే గడిచిన 3 రోజులుగా వెండి, బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. బంగారం కొనేవారికి ఇది సరైన సమయమని చెప్పవచ్చు. ఇక వెండి ధర రూ. 63,500 కు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.