నేటి ఆధునిక సమాజంలో దాదాపు గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లు ఉండదు. అయితే ప్రతీ ఒక్క కుటుంబానికి LPG గ్యాస్ కనెక్షన్ ఉన్నప్పటికీ.. ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన విషయాలు వినియోగదారులకు తెలియవు. గ్యాస్ బండ నింపిచ్చామా? వాడామా? అంత వరకే సగటు వినియోగదారులు ఆలోచిస్తారు. కానీ అనుకోని ప్రమాదం గ్యాస్ సిలిండర్ ద్వారా జరిగితే.. ప్రమాద బీమా ఉంటుంది అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇక గ్యాస్ ఏజెన్సీలు సైతం ప్రమాద బీమాపై వినియోగదారులకు అవగాహన కల్పించదు. అందుకే గ్యాస్ కస్టమర్లు కచ్చితంగా ఈ బీమా సదుపాయాల గురించి తెలుసుకోవాలి. LPG గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి రూ. 50 లక్షల వరకు బీమా ఉంటుందని మీకు తెలుసా? దీనిక సబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
చాలా మంది గ్యాస్ వినియోగదారులకు కేవలం దాన్ని వాడి.. అది అయిపోయాక మళ్లీ నింపించుకోవడం మాత్రమే తెలుసు. అయితే గ్యాస్ ప్రమాదం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తే.. దానికి గ్యాస్ కంపెనీల నుంచి బీమా సదుపాయం లభిస్తుందని మీకు తెలుసా? పూర్తి వివరాల్లోకి వెళితే.. మీరు గ్యాస్ కనెక్షన్ తీసుకున్న సమయంలోనే మీకు ఎల్పీజీ బీమా సదుపాయం చేయబడుతుంది. మీరు కనెక్షన్ తీసుకున్న వెంటనే మీకు రూ.40 లక్షల ప్రమాద బీమా వస్తుంది. సిలిండర్ పేలుడు కారణంగా ప్రాణ నష్టం సంభవిస్తే రూ. 50 లక్షల వరకు బీమా లభిస్తుంది. కుటుంబ సభ్యులు ఈ బీమాను క్లెయిమ్ చేయవచ్చు. ఈ క్రమంలో బీమా కోసం ఎలాంటి అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.
గ్యాస్ సిలిండర్ ద్వారా ప్రమాదం జరిగి ప్రాణ, ఆస్తి నష్టం జరిగితే.. ఈ ప్రమాదం జరిగిన 30 రోజులలోపు వినియోగదారుడు అతడు వినియోగించే గ్యాస్ ఏజెన్సీకి, పోలీసు స్టేషన్ కు ప్రమాదం గురించి ఫిర్యాదు చేయాలి. అదీ కాక ప్రమాదానికి సంబంధించి పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్ కాపీని తీసుకోవాలి. దానితో పాటు మెడికల్ రసీదు, ఆస్పత్రి బిల్లు, ప్రాణ నష్టం జరిగితే పోస్ట్ మార్టం రిపోర్టు, మరణ ధృవీకరణ పత్రాలు అని కలిపి సంబంధిత గ్యాస్ కంపెనీలో క్లెయిమ్ చేయాలి.
ఈ నేపథ్యంలోనే మీరు క్లెయిమ్ కు అర్హులు కావాలి అంటే రెగ్యూలర్ గా సిలిండర్, స్టవ్ చెకప్ చేయిస్తుండాలి. ఈ పాలసీలో ఎవరినీ మీరు నామినీగా చేయలేరు, ఎవరి పేరు మీద ఉంటే వారికే బీమా లభిస్తుంది. ఇక మీరు క్లెయిమ్ చేసిన ప్రమాదాన్ని మీ ఏజెన్సీ సదరు చమురు కంపెనీ, బీమా కంపెనీలకు పంపిస్తారు. ఈ క్రమంలోనే బిపిసిఎల్, హెచ్ పిసిఎల్, ఇండియన్ ఆయిల్ కంపెనీల కారణంగా ప్రమాదం సంభవిస్తే.. మెుత్తం ఖర్చును ఈ కంపెనీలే భరిస్తాయి. మరిన్ని వివరాలకు మీ గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించండి.