SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Follow These Tips To Avoid Job Scams

పార్ట్ టైం జాబ్ స్కామ్స్.. నకిలీ జాబ్ వెబ్ సైట్లను గుర్తించడమెలా? మోసపోకూడదంటే ఏం చేయాలి?

  • Written By: Nagarjuna
  • Published Date - Thu - 17 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పార్ట్ టైం జాబ్ స్కామ్స్.. నకిలీ జాబ్ వెబ్ సైట్లను గుర్తించడమెలా? మోసపోకూడదంటే ఏం చేయాలి?

చదువు అయిపోయింది. కుర్రాడు ఇంట్లో ఖాళీగా ఉన్నాడు. పేరుకే ఖాళీ.. కానీ ఉద్యోగాల కోసం వేటలో ఉన్నాడు. అది బయటకు కనబడేది కాదు కాబట్టి తెలియని వాళ్ళు అంటే చుట్టుపక్కల వాళ్ళు.. ‘ఏం బాబు, ఏం చేస్తున్నావ్’ అంటూ మొదలుపెడతారు. ఇక చుట్టుపక్కల వాళ్ళ నుంచి ప్రెజర్ మొదలవుతుంది. ప్రెజర్ కుక్కర్ విజిల్స్ వేసినట్టు.. అడుగుతూనే ఉంటారు. ఈ ప్రెజర్ తట్టుకోలేక పాపం కుర్రాడు.. గూగుల్ లో ఆ సైటు, ఈ సైటు చూసి కనబడిన జాబ్స్ కి అప్లై చేసేయాలనుకుంటాడు. పెద్ద కంపెనీలో జాబ్ వచ్చేలోపు అందాక పార్ట్ టైం జాబ్ చేయాలని అనుకుంటాడు. గూగుల్ లో పార్ట్ టైం జాబ్స్ అని కొట్టగానే వచ్చే పెద్ద లిస్టే వస్తుంది. అందులో ఏది జెన్యూనో, ఏది నకిలీనో అర్ధం కాదు. ఈ కన్ఫ్యూజన్ లోనే లింకులు క్లిక్ చేసేస్తాడు. కట్ చేస్తే ఖేల్ ఖతం, దుకాణ్ బంద్. 

డేటా ఎంట్రీ జాబ్ మోసాలు:

ఆన్ లైన్ మోసాల్లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రధానమైన మోసం డేటాఎంట్రీ. ఇంగ్లీష్ భాషల్లో ఏ భాష వారికి నచ్చని పదం ఈ డేటాఎంట్రీ. డేటా ఎంట్రీ పేరుతో జరిగే మోసాల వల్ల డేటా ఎంట్రీ అంటే అదొక బూతు పదంలాగా అయిపోయింది. ఈ డేటా ఎంట్రీ పేరుతో ఇప్పటికీ మోసాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ కొన్ని లక్షల మంది మోసపోతున్నారు. ఈ డేటా ఎంట్రీ స్కామ్ లో రెండు  పద్ధతులు ఉన్నాయి. ఒకటి.. జాబ్ రావాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు కింద కొంత డబ్బు చెల్లించమంటారు. రెండోది, ముందు ఒక ప్రాజెక్ట్ ఇచ్చి.. పని పూర్తయ్యాక కన్సల్టేషన్ ఫీజు అని అకౌంట్ లో డబ్బులు వేయమంటారు. అడుక్కోవడంలో ఇదొక రకమైన ట్రెండ్ అన్నమాట. కష్టపడి పని చేయడం చేతకాని వాళ్ళు ఇలా మోసాలకు పాల్పడుతుంటారు. అసలు జాబ్ ఇచ్చేవాడికి డబ్బులెందుకివ్వాలి? పని చేయించుకుంటున్నాడు కాబట్టి, పనిని అమ్ముకుంటున్నాడు కాబట్టి వచ్చిన లాభాల్లోంచి జీతం ఇవ్వాలి. ఇది కదా ప్రాసెస్ ఆఫ్ జాబ్. కానీ ఇలా జరగట్లేదు.

follow-these-tips-to-avoid-job-scams

యాక్చువల్లీ మేము జాబ్ చూపిస్తాం సార్, మమ్మల్ని కన్సల్టెంట్స్ అంటారు సార్ అని షో చేస్తారు. మొదటి జీతం వచ్చాక అందులో ఇస్తానంటే.. టాటా, బాయ్ బాయ్ అని చెప్పేసి బ్లాక్ చేసేస్తారు. ఇలా తెగట్లేదని చెప్పి రూట్ మార్చి.. అబ్బే మేము డబ్బులు తీసుకోమండి అని చెప్పి వర్క్ ఇస్తారు. ఇమేజెస్ రూపంలో ఉన్న డేటాని ఎక్సెల్ షీట్ లో ఎక్కించమనో, పీడీఎఫ్ ఫైల్స్ ని డాక్యుమెంట్స్ లో టైప్ చేయమనో చెప్తారు. వారమంతా ఆడతా పాడతా పనిచేస్తే 5 వేలు వస్తాయ్ కదా అని అనుకుంటాడు. ఇంకేముంది పెద్ద గూగుల్ ప్రాజెక్ట్ వచ్చిందని ఫీలైపోయి.. కసిగా వారం రోజుల పాటు టైప్ చేసుకుంటూ కూర్చుంటాడు. ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వగానే సబ్మిట్ చేసి కాల్ చేస్తే.. ‘వెరీ గుడ్, చాలా బాగా చేశారు’ అని అంటారు.

మీ ప్రాజెక్ట్ డబ్బులు రావాలంటే మా బ్రోకర్ ఫీజు ఇవ్వాలని, ఒక బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తారు. అప్పుడు ‘నాకు రావాల్సిన దాంట్లో కట్ చేసుకుని మిగతా డబ్బులు ఇవ్వండి’ అని అంటే.. వాళ్ళేం చేస్తారో తెలుసా. మీ ఫోన్ నంబర్ బ్లాక్ చేస్తారు. రెస్పాన్స్ ఉండదు. తెలివైన వాళ్ళు శ్రమ మాత్రమే పోయిందని సైడ్ అవుతారు. అమాయకులైతే డబ్బులు కూడా పోయాయని చేతులు కాల్చుకుంటారు. ఇలాంటప్పుడే మనకి గుర్తొచ్చే డవిలాగ్.. “ఈ డేటా ఎంట్రీ జాబులు, పార్ట్ టైం జాబులు మనవల్ల కాదురా. శుభ్రంగా 4 గేదెలు కొనుక్కుని కాసుకుంటే మంచిది” అని అనిపిస్తుంది. గేదెలు కొనడానికైనా డబ్బులు కావాలిగా. ఆ డబ్బుల కోసమైనా ఉద్యోగం కావాలిగా. ఆ ఉద్యోగం రావాలంటే అదో రాజమౌళి ప్రాజెక్ట్ లా టైం పడుతుందిగా. మళ్ళీ కథ మొదలుకొస్తుందిగా. అందాక పార్ట్ టైం జాబ్ చేయాలనిపిస్తుందిగా. ఇంకేముంది ఐపాయ్. 

పార్ట్ టైం జాబ్ మోసాలు:

follow-these-tips-to-avoid-job-scams

డేటా ఎంట్రీ జాబ్స్ అంటే నమ్మడం లేదని, కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఫోన్ కి, వాట్సాప్ లో, మెయిల్స్ కి పార్ట్ టైం జాబ్ పేరుతో మెసేజ్ లు వస్తుంటాయి. వాటిలో కొన్ని లింకులు ఉంటాయి. అప్పుడే ఫ్రెండ్ చెప్పింది గుర్తుకొస్తుంది. ‘పార్ట్ టైం జాబ్స్ ని నమ్మకూడదురా, కొన్ని ఫేక్ ఉంటాయి’ అని ఫ్రెండ్స్ చెప్పింది గుర్తొచ్చి ఆగిపోయినా.. మనసులు ఒకవేళ జెన్యూన్ కంపెనీ అయితే ఏంటి పరిస్థితి అని లోపల సంటోడు ఓ తెగ మారం చేస్తుంటాడు. ఆ సంటోడ్ని సేటిస్ఫై చేయడం కోసం ధైర్యం చెప్పుకుని లింక్ ఓపెన్ చేస్తాడు. ఒక వెబ్ సైట్ ఓపెన్ చేయగానే.. లాగిన్ అవ్వమని అంటుంది. ఆ తర్వాత టాస్కుల రూపంలో కొన్ని పనులు చేయిస్తారు. అవి పూర్తవగానే వెబ్ సైట్ కి సంబంధించిన అతని వాలెట్ లో డబ్బులు జమ చేస్తారు. ఆ డబ్బుల్ని వెంటనే ఆ కుర్రాడు తన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. కక్కుర్తి పడి ఇంకా సంపాదించాలని ఇంకా టాస్కులు ఉన్నాయేమో అని చూస్తే.. అసలు చిక్కు మొదలవుతుంది.

ఈ టాస్కులు కొనుక్కోవాలి అని గుండె పగిలే అలర్ట్ మెసేజ్ వస్తుంది. సర్లే తక్కువ డబ్బులే కదా అని టాస్కు కొంటాడు. నమ్మకంగా ఉండడం కోసం నకిలీ కంపెనీ మోసగాళ్లు డబ్బులు వేస్తారు. ఇదేదో బాగుందే అని ఎక్కువ డబులొస్తాయన్న ఆశతో ఎక్కువ టాస్కులు కొనుక్కుంటే వాడి ట్రాప్ లో పడినట్టే. ఆ టాస్కులు కొని, పని పూర్తి చేశాక గుండెలో బాంబు పేల్చుతారు. మీ పని డబ్బులు రావాలంటే.. మాకు డబ్బులు కట్టాలి అని అంటారు. ‘మొత్తం మా టైం అంతా వ్యాస్ట్ అయిపోయింది, ఎంతోకొంత ముట్టజెప్పండి’ అని బతిమిలాడినా ప్రయోజనం ఆఫ్ ఇండియా ఉండదన్నమాట. ఇలా మొదట ఆడు ఇచ్చేది అర్ధరూపాయి అయితే.. వీడు కోల్పోయేది వేలల్లో ఉంటుంది. మోసగాళ్లకు మోసగాడు లాంటోడు అయితే ఫస్ట్ టైం ఫ్రీగా టాస్క్ తీసుకుని.. ఫినిష్ చేసి వచ్చిన డబ్బులతో బయటకొచ్చేసి.. ఇలాంటి సైట్లు ఇంకేమైనా ఉన్నాయా అని సెర్చింగులు చేస్తాడు.

వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మోసాలు:

follow-these-tips-to-avoid-job-scams

ఇంట్లోనే ఉండి నెలకి లక్షల్లో సంపాదించుకోవచ్చు అని మహిళలని టార్గెట్ చేస్తారు. ఫోన్ కి మెసేజ్ లు వస్తాయి. లేదా ఫోన్ చేస్తారు. పలానా కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాం అని మాట్లాడతారు. మా కంపెనీలో అనేక ఉత్పత్తులు ఉన్నాయని అంటారు. వాటిని మీరు పది మందికి షేర్ చేస్తే.. మీకు డబ్బులు వస్తాయని అంటారు. ఈ కంపెనీలో చేరాలంటే డబ్బులు కట్టాలని అంటారు. 2000 కట్టమంటారు. తక్కువ అమౌంటే కదా అని కడతారు. అయితే మీతో పాటు మందని ఈ ప్రాజెక్ట్ లో చేర్పించండి, కమిషన్ ఇస్తామని ఆశ చూపిస్తారు. ఎంతమందిని చేర్పిస్తే అంతమందికి ఇంత పర్సంటేజ్ చొప్పున కమిషన్ వస్తుంది అని అంటారు. దీంతో పాటు.. మా వెబ్ సైట్ లో బోలెడన్ని బ్యూటీ ప్రాడెక్ట్స్ ఉన్నాయి. అవి షేర్ చేయండి. అవి ఎవరైనా కొంటే మీకు అందులో కూడా కమిషన్ ఇస్తామని అంటారు.

ఇప్పుడు మొదట జాయిన్ అయిన ఆమె ఉంటుంది కదా.. ఆవిడ మేకల మందలా గుంపుని నమ్మించి చేర్పిస్తుంది. ఈవిడ కేజీఎఫ్ లో యష్ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చాక వాళ్లు జాయిన్ అవ్వకుండా ఎలా ఉంటారు చెప్పండి. పాపం ఈవిడ మాటలు నమ్మి 20 మంది 2వేల చొప్పున 40 వేలు కడతారు. వాళ్ళు కంపెనీ ప్రొడక్ట్స్ ని షేర్ చేస్తుంటారు. ఆ స్కామ్ గాడి టార్గెట్ వంద మందో, 2 వందల మందో ఉంటుంది. అది రీచ్ అయ్యే వరకూ వాళ్ళిచ్చిన డబ్బుల్లోంచే ఒక శాతం డబ్బులు ఖర్చు పెట్టి చిన్న చిన్న గిఫ్ట్ లు మొఖాన పడేస్తాడు. మొదట జాయిన్ అయిన ఆమె కళ్ళలో ఆనందం వచ్చేస్తుంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్ అని సంబరపడిపోయి ఇంకో పాతిక మందిని జాయిన్ చేస్తుంది. ఈవిడని చూసి మొదట్లో జాయిన్ అయిన 20 మంది కూడా విపరీతంగా నకిలీ కంపెనీ ఉత్పత్తులని ప్రమోట్ చేస్తారు.

follow-these-tips-to-avoid-job-scams

ఈ క్రమంలో ఒక నెల పూర్తవుతుంది కదా. ఆమె కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. మొదట 20 మందిని జాయిన్ చేసినందుకు ఒక్కో మనిషి నుంచి 2వేలలో ఒక వెయ్యో, 5వందలో తీసి.. 20 వేలు లేదా 10 వేలు మొదట జాయిన్ అయిన ఆమె అకౌంట్ లో వేస్తాడు. డౌట్ రాకుండా ఉండాలి కాబట్టి. అయ్యబాబోయ్ మన నాయకురాలికి జీతం కూడా వచ్చిందే అని ఈ 20 మందిలో ఒక్కొక్కరూ కనీసం 10 మంది చొప్పున 200 మందిని జాయిన్ చేస్తారు. 200 కాకపోయినా 100 మందిని జాయిన్ చేసినా.. 2వేల చొప్పున వంద మంది 2 లక్షలు కడతారు. ఇలా వాడి టార్గెట్ కోటి రూపాయలు రీచ్ అయ్యే వరకూ వీళ్ళ డబ్బులనే వీరికి ఇస్తూ ఉంటాడు. ఈలోపు వీళ్ళు బ్యూటీ ప్రొడక్ట్స్ కి టెంప్ట్ అయ్యి కొనకుండా ఉంటారా? మళ్ళీ ఇంట్లో భర్తలకు ఇదొక లాసు.

వాడి కోటి రూపాయల టార్గెట్ రీచ్ అయిన మరు క్షణమే ఫోన్ స్విచ్చాఫ్ అవుతుంది. ప్రతి నెలా వచ్చే కమిషన్ లు ఆగిపోతాయి. అప్పటి వరకూ కమిషన్ మొఖం చూడనోళ్లు తిరుగుబాటు చేస్తారు. ఇంట్లో తపేలాలు, గుండుగులు తెచ్చి మీద ఇసురుతారు. కాసేపు మూడవ ప్రపంచయుద్ధమే జరుగుతుంది. అంతా అయిపోయాక మోసపోయామని రియలైజ్ అవుతారు. ఇది ఒక రకమైన మోసం. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబుల పేరుతో ఇలా రకరకాలుగా మోసాలు చేస్తారు. డబ్బులు కట్టి నువ్వు జాయినవ్వు, ఇంకో పది మందిని జాయిన్ చెయ్ అని అంటున్నప్పుడే అర్ధమైపోవాలి. అంతా అయిపోయాక.. ‘మా ఆయన ముందే చెప్పాడురా నేనే వినలేదు. ఐ డిడ్ ఏ మిస్టేక్’ అని అనుకోవడం తప్ప ఏం ఉండదు.  

ఈ నకిలీ కంపెనీలను ఇలా గుర్తించండి:

  • పార్ట్ టైం జాబ్ అయినా, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నా కూడా.. మీ బ్యాంకు ఖాతాలు మాత్రమే తీసుకుంటే అనుమానించాల్సిందే. 
  • మీ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్లు, ఉద్యోగానికి సంబంధించిన ఇతర డాక్యుమెంట్లు అడగడం లేదంటే అనుమానించాల్సిందే.
  • మీ ఖాతాలో జీతం వేయడానికి.. మీ నెట్ బ్యాంకింగ్ వివరాలు ఇవ్వండి అని అడిగినా కూడా అనుమానించాల్సిందే. 
  • ఉద్యోగంలో చేరాలంటే డబ్బులు కట్టాలి అని అంటారు. ఇది ఘోరంగా అనుమానించాల్సిన విషయం.
  • ప్రాజెక్ట్ అయినా, వెబ్ సైట్ లో టాస్కులు అయినా డబ్బులు చెల్లించి కొనుక్కోవాలి అని అడిగితే మొహమాటం లేకుండా బాటా చెప్పు ఎమోజీని వాడికి మెయిల్ లోనో, వాట్సాప్ లోనో పంపండి. 
  • ఎంత ఎలాంటి కంపెనీ అయినా సరే ఉద్యోగిని డబ్బులు అడగదు. అడిగితే అనుమానించండి.
  • ఇక మీరు చేరి.. కొంతమందిని చేర్చండి అని చెప్పే చెయిన్ ప్రాసెస్ ని బ్రేక్ చేయండి. ప్రపంచంలో ఏ కంపెనీ కూడా ఇలా చెప్పదు.

మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?

  • స్నేహితుల ద్వారానో, ఫ్రెండ్స్ ద్వారానో ఆన్ లైన్ జాబ్స్ ఉంటే అడిగి తెలుసుకోండి. 
  • తెలిసిన వాళ్లు లేకపోతే టాస్కులు, డేటా ఎంట్రీలు కాకుండా.. ఏదైనా కోడింగ్ మీద జాబులు ఉంటే చూసుకోండి.
  • ఏదైనా కంపెనీ నుంచి మెయిల్ గానీ, మెసేజ్ గానీ డైరెక్ట్ గా మీ ఫోన్ కి వచ్చిందంటే నమ్మకండి. ఎందుకంటే ఏ కంపెనీ కూడా డైరెక్ట్ గా ఎవరికీ మెసేజ్ పంపదు.
  • పార్ట్ టైం జాబ్స్ అని వచ్చే మెసేజులని నమ్మకండి. ఈ విషయంలో మీ తెలివైన ఫ్రెండ్స్ అభిప్రాయాన్ని తీసుకోండి. వారు పర్లేదు ఓకే అంటే వెళ్ళండి. లేదంటే ఆగిపోండి.
  • ఏ కంపెనీ పేరుతో అయినా పార్ట్ టైం జాబ్స్ అంటే ముందు ఆ కంపెనీ చరిత్ర ఏంటో, అప్పటి వరకూ ఆ కంపెనీ చేసిన ప్రాజెక్ట్స్ ఏంటో పరిశీలించండి. 
  • ఈరోజుల్లో కంపెనీని ప్రతివాడూ రిజిస్టర్ చేయిస్తున్నాడు. గూగుల్ లో సెర్చ్ చేస్తే కంపెనీ వివరాలు వస్తాయి. గూగుల్ లో ఉంది కదా, కంపెనీ జెన్యూన్ అనుకుంటే పొరపాటే. గూగుల్ లో ఉండడం ముఖ్యం కాదు, దానికొక ఘన చరిత్ర ఉండడం కూడా ముఖ్యమే.
  • నకిలీ కంపెనీ వివరాలు, మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు గూగుల్ లో సెర్చ్ చేసి చూడండి. దాని పేరు మీద బాధితులు ఎవరైనా ఫిర్యాదులు చేశారేమో కనబడుతుంది. 
  • ట్రూ కాలర్ లో ఫోన్ నంబర్ పరిశీలిస్తే స్పామ్ అని వస్తే.. ఆలోచించకుండా బ్లాక్ చేయండి. 
  • ఏ మాత్రం చిన్న సందేహం వచ్చినా వెంటనే వారిని బ్లాక్ చేసేయండి. 
  • వాళ్ల వెబ్ సైట్ లో లాగిన్ అయి ఉంటారు కాబట్టి బ్రౌజర్ హిస్టరీని క్లియర్ చేయండి. 
  • ఒకవేళ ఏమైనా డబ్బు కట్టి.. మోసపోయి ఉంటే గనుక సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయండి.

Tags :

  • Fake Jobs
  • Job Scams
  • Work From Home
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TCSలో ఉద్యోగాలు వదిలేస్తున్న మహిళలు .. అదే కారణమా?

TCSలో ఉద్యోగాలు వదిలేస్తున్న మహిళలు .. అదే కారణమా?

  • పది పాసైతే చాలు.. TTDలో ఉద్యోగం.. రూ. లక్ష జీతం.. కానీ?..

    పది పాసైతే చాలు.. టీటీడీలో ఉద్యోగం.. రూ. లక్ష జీతం.. కానీ?..

  • దగ్గు, జ్వరం లక్షణాలుంటే ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం..!

    దగ్గు, జ్వరం లక్షణాలుంటే ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం..!

  • యూట్యూబ్ వీడియోలను లైక్ చేసే జాబ్.. ఒక్కో లైక్‌కు రూ. 50.. రూ.75 లక్షలు కాజేసిన కేటుగాళ్లు..

    యూట్యూబ్ వీడియోలను లైక్ చేసే జాబ్.. ఒక్కో లైక్‌కు రూ. 50.. రూ.75 లక్షలు కాజేసిన కేటుగాళ్లు..

  • గృహిణులే లక్ష్యంగా కొత్త మోసాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో లక్షలు స్వాహా!

    గృహిణులే లక్ష్యంగా కొత్త మోసాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో లక్షలు స్వాహా!

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • ఏపీ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని నిర్ణయం, ఆ మండపాలకు ఫ్రీ కరెంట్

  • విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుష్, కింగ్డమ్ ఓటీటీ ఎప్పుడంటే

  • బిగ్‌బాస్‌తో కెరీర్ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా, ఎవరేం చేస్తున్నారు

  • డ్యాన్స్ అంటే ఇదీ, టీచర్ స్టెప్పులు చూస్తే ఫిదా కావల్సిందే

  • ఇద్దరికిద్దరు టాప్ హీరోయిన్స్..చిన్నప్పటి నుంచీ బెస్ట్ ఫ్రెండ్సే ఎవరో తెలుసా

  • ఆ సూపర్ హిట్ సినిమా ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరోయిన్, అస్సలు గుర్తుపట్టలేరు

  • ఒకప్పుడు యూత్ కలల రాకుమారి, టాప్ హీరోయిన్..ఇప్పుడు 2 వేల కోట్ల ఆస్థి, ఎవరో తెలుసా

Most viewed

  • నందమూరి కుటుంబంలో విషాదం, పెద్ద కోడలు పద్మజ మృతి

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • కేక పుట్టిస్తున్న హైబ్రిడ్ కారు, ఛార్జ్ చేస్తే 1200 కిలోమీటర్లు, లక్షన్నర డిస్కౌంట్ కూడా

  • ఫౌజీ నుంచి ప్రభాస్ లుక్ లీక్, డార్లింగ్ కటౌట్ అదిరింది కదా

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam