యూట్యూబ్ లో ఒక్కో వీడియోని లైక్ చేసినందుకు రూ. 50 ఇచ్చారు. అలా రూ. 50 ఇస్తూ ఒక్కరోజులో రూ. 75 లక్షలు సంపాదించారు. వీడియోని లైక్ చేసే జాబ్ ఇచ్చినోడే రూ. 75 లక్షలు సంపాదిస్తే మరి వీడియోలను లైక్ చేసిన వాళ్ళు ఎన్ని లక్షలు, కోట్లు సంపాదించి ఉంటారో? అని అనిపిస్తుందా? అయితే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
చదువు అయిపోయింది. కుర్రాడు ఇంట్లో ఖాళీగా ఉన్నాడు. పేరుకే ఖాళీ.. కానీ ఉద్యోగాల కోసం వేటలో ఉన్నాడు. అది బయటకు కనబడేది కాదు కాబట్టి తెలియని వాళ్ళు అంటే చుట్టుపక్కల వాళ్ళు.. ‘ఏం బాబు, ఏం చేస్తున్నావ్’ అంటూ మొదలుపెడతారు. ఇక చుట్టుపక్కల వాళ్ళ నుంచి ప్రెజర్ మొదలవుతుంది. ప్రెజర్ కుక్కర్ విజిల్స్ వేసినట్టు.. అడుగుతూనే ఉంటారు. ఈ ప్రెజర్ తట్టుకోలేక పాపం కుర్రాడు.. గూగుల్ లో ఆ సైటు, ఈ సైటు చూసి కనబడిన జాబ్స్ […]