రెండు చక్రాల వాహనాల్లో అందరికీ స్కూటీ అంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే స్కూటీ నడపడం తేలిక, ట్రాఫిక్ లో కూడా ఎంతో కంఫర్ట్ గా ఉంటుంది. కానీ, బ్యాలెన్సీ, సేఫ్టీ విషంలో స్కూటీ అంటే చాలా మంది భయపడతారు. అలాంటి వారి కోసం యమహా నుంచి కొత్త త్రీ వీల్ స్కూటీ వచ్చేసింది.
ప్రజలు అంతా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కంటే సొంతవాహనాలను వినియోగించేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ టూ వీలర్ అయితే ట్రాఫిక్ లో ఎలాంటి చికాకు లేకుండా వెళ్లచ్చు అనుకుంటారు. వాటిలో కూడా చాలామంది స్కూటీలు ఇష్టపడుతుంటారు. స్కూటీ అయితే గేర్లతో పనిలేకుండా త్వరగా వెళ్లేందుకు వీలుంటుంది. అయితే స్కూటీల వల్ల ఎంత కంఫర్ట్ ఉంటుందో అంతే ప్రమాదం కూడా దాగుంటుంది. మలుపులు తిరిగే సమయంలో, వేగంగా వెళ్లేటప్పుడు స్కూటీలు బ్యాలెన్స్ చేయడం కష్టం. ఇప్పుడు యమహా ట్రైసిటీతో ఆ భయం తప్పుతోంది. అలాంటి భయాలు లేకుండా ఉండేలా యమహా నుంచి మూడు చక్రాల స్కూటీ ఒకటి వచ్చేసింది.
యమహా నుంచి భారత మార్కెట్ లోకి ట్రైసిటీ అనే స్కూటీ ఒకటి విడుదలైంది. పేరులోలాగానే దీనికి మూడు చక్రాలు ఉంటాయి. ముందు రెండు చక్రాలు ఉండగా.. వెనుక ఒక చక్రం ఉంటుంది. ఈ మూడు చక్రాల స్కూటీని యమహా గ్లోబల్ మార్కెట్ లో 2014లోనే విడుదల చేసింది. కానీ, భారత్ మార్కెట్ లో మాత్రం విడుదల చేయలేదు. ఈ స్కూటీ 125 సీసీ, 155 సీసీ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇంక ఫీచర్ల విషయానికి వస్తే.. ఎల్సీడీ సెంట్రల్ కన్సోల్, సంటర్ ఎల్ఈడీ లైట్, డేటైమ్ రన్నింగ్ ఎల్ఈడీలు, స్మార్ట్ పోన్ కనెక్టవిటీ, కీ లెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటీకి మొత్తం మూడు డిస్కులు ఉంటాయి. మూడు టైర్లకు డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఫ్రంట్ టైర్లకు టెలిస్కోపిక్ సస్పన్షన్, వెనుకవైపు డ్యూయెల్ షాక్ అబ్జార్బర్ ఉంటాయి.
ఇంక వేరియంట్ల విషయానికి వస్తే.. 125 సీసీ స్కూటీ 12.06 బీహెచ్ పీ, 11.2 టార్క్ తో వస్తోంది. ఇంక 155 సీసీ వేరియంట్ 14.88 బీహెచ్ పీ, 14 ఎన్ఎమ్ టార్క్ తో లభిస్తోంది. జపనీస్ మార్కెట్ లో దీని ధర చూస్తే.. 125 సీసీ వేరియంట్ రూ.3,10 లక్షలు, 155 సీసీ వేరియంట్ ధర రూ.3,54 లక్షలుగా ఉంది. అయితే ఈ స్కూటీని భారత మార్కెట్ లోకి విడుదల చేస్తారా? చేయరా? అనే దానిపై క్లారిటీ లేదు. యమహా కంపెనీ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. 2014లో విడుదల కాగా.. ఆశించిన విజయాన్ని అందుకోలేదు. 2019లో రీ ఎంట్రీ ఇచ్చినా కూడా యూరప్, ఆసియా మార్కెట్లలో ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మల్లీ 2023లో వచ్చిన ఈ ట్రైసిటీ స్కూటర్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.