ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. పర్యావరణహితం కోసం, కార్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వాలు సైతం ఈవీ వెహికిల్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేక డిస్కౌంట్స్, ప్రోత్సాహకాలు ఉన్నాయి. ట్యాక్స్ నుంచి మినహాయింపు వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. కంపెనీలకు సైతం అన్ని ప్రభుత్వాలు ఎక్కువ ప్రాధాన్యాతను ఇస్తున్నాయి. పెరుగుతున్న డిమాండ్ తో మార్కెట్ లో ఎలక్ట్రికల్ వాహనాల కంపెనీలు, ఉత్పత్తులు కూడా పెరిగిపోయాయి. ఇప్పటికే ద్విచక్రవాహనాలు, కార్లు అంటూ చాలానే మోడల్స్ మార్కెట్ లో ఉన్నాయి. వాటిలో చాలా తక్కువ కంపెనీలు మాత్రమే ప్రజల నమ్మకాన్ని పొందాయి. వాటిలో టాటా కంపెనీ కూడా ఒకటి.
వస్తువు ఏదైనా ప్రపంచవ్యాప్తంగా టాటా కంపెనీ ఉత్పత్తులకు ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే. ఇప్పటికే టాటా కంపెనీ నుంచి విడుదలైన నెక్సన్ ఈవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవలే టాటా నుంచి మరో కొత్త ఎలక్ట్రానిక్ కారును విడుదల చేశారు. టాటా టిగోర్ మోడల్ ని ఎలక్ట్రానిక్ వెర్షన్ లో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. విడుదలైన మొదటి నెలలోనే ఈ టిగోర్ ఈవీ మోడల్ కు మొత్తం 20వేలకు పైగా బుకింగ్స్ లభించినట్లు ఆ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. అలాగే ఇప్పుడు ఈ కాారుకు సంబంధించిన మరిన్ని వివరాలు, ఫీచర్లు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ టిగోర్ ఈవీ 2022 ఎక్స్ షోరూమ్ ధర రూ.12.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే మ్యాగ్నెటిక్ రెడ్ కలర్ లో కూడా ఈ మోడల్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
అలాగే ఈ టిగోర్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఈ ఈవీ మోడల్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ లభిస్తుంది. 26 కిలోవాట్స్ సామర్థ్యంతో బ్యాటరీ లభిస్తోంది. ఈ బ్యాటరీలకు 8 ఏళ్ల వారెంటీ కూడా ఇస్తున్నారు. ఈ 5 సీటర్ లో 316 లీటర్స్ బూట్ స్పేస్ లభిస్తోంది. ఈ సెడాన్ 172 గ్రౌండ్ క్లియరెన్స్ అన్ లాడెన్ తో వస్తోంది. ఈ 26 వాట్ బ్యాటరీలు పూర్తిగా ఛార్జ్ అయ్యేందుకు 7.5 గంటలు(A.C), 59 నిమిషాలు(D.C) సమయం పడుతుంది. హైవేలపై బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లను ఇన్ స్టాల్ చేస్తే రాబోయే కార్లన్నీ ఈవీలే అవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క టాటానే కాకుండా మహింద్రా వంటి కంపెనీలు కూడా ఈవీ వాహనాలను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.
మార్కెట్ లో నెలకొన్న డిమాండ్, పోటీకి తగ్గట్లు కంపెనీలు సరికొత్త మోడల్స్, ఫీచర్లతో ఎలక్ట్రికల్ కార్లను తీసుకొస్తున్నాయి. అదన్నమాట విషయం.. ఈ టిగోర్ వాహనాన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళవచ్చు. లేదా విజయవాడ నుంచి హైదరాబాద్ రావచ్చు. లేదంటే 300 కి.మీ.ల వరకూ మీకు నచ్చిన ప్లేస్ కి వెళ్ళచ్చు. మిమ్మల్ని ఎవరు ఆపేది. రూ. 15 లక్షల లోపు ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఎలక్ట్రిక్ వాహనం వస్తుందంటే తీసుకోవచ్చు. మరి టాటా తీసుకొచ్చిన ఈ టిగోర్ ఈవీపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.