కారు కొనాలి అని అందరికీ ఉంటుంది. కొంతమంది రూపాయి రూపాయి కూడబెట్టుకుని కారు కొనుక్కుని ఎంతో మురిసి పోతుంటారు. కానీ, ఏ కారు కొంటున్నాం. ఎంత బడ్జెట్ లో కొంటున్నాం. అనే విషయాలు బాగా తెలుసుకోవాలి. అలాగే మనకు ఎలాంటి మోడల్ కారు సెట్ అవుతుంది అనే విషయంపై మీకు క్లారిటీ ఉండాలి.
కారు.. ప్రతి ఒక్కరికి తమ సొంత కారులో తిరగాలి అని ఉంటుంది. చాలా మందికి కారు కొనాలి అనేది జీవితాశయం కూడా. గతంలో అంటే కారుని లగ్జరీగా భావించేవారు. కానీ, ఇప్పుడు కారు అవసరంగా మారిపోయింది. అందుకే మధ్యతరగతి వాళ్లు కూడా ఒక కారు కొనాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. కారులో సాధారణంగా ఫ్యామీలీ కోసం అంటే ఎస్యూవీనే బెస్ట్ ఆప్షన్ గా చెప్పచ్చు. అయితే ఎస్యూవీ అనగానే కాస్త ధర ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ, రూ.8 లక్షలలోపు ఉన్న బెస్ట్ ఎస్యూవీలను ఈరోజు మీకోసం తీసుకొచ్చాం. వాటిలో మీరు గనుక ఎస్యూవీ తీసుకోవాలి అనుకుంటే ఒకసారి వీటిపై లుక్కేయండి.
టాటా కంపెనీకి భారత్ లో ఎంతో గొప్ప ఆదరణ ఉంది. లాభార్జన గాకుండా ప్రాయణికుల భద్రత మీదే టాటా కంపెనీ ఎక్కువ శ్రద్ధ పెడుతుంటుంది. టాటా కంపెనీ నుంచి ఎస్యూవీలో పంచ్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ పంచ్ కి చాలా మంది రెస్పాన్స్ వచ్చింది. ఈ పంచ్ మోడల్ లో పెట్రోల్- డీజిల్ రెండూ వేరియంట్స్ ఉన్నాయి. అలాగే మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిసషన్స్ లో అందుబాటులో ఉంది. 366 లీటర్స్ బూట్ స్పేస్, 1199 సీసీ ఇంజిన్ తో వస్తోంది. ఈ కారు గరిష్టంగా 20.09 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. దీని ప్రారంభ ధర రూ.5.99 లక్షల నుంచి హైఎండ్ రూ.9.46 లక్షల వరకు ఉంది.
నిస్సాన్ నుంచి చాలా తక్కువ మోడల్స్ మాత్రమే క్లిక్ అయ్యాయి. అయితే ఇటీవలి కాలంలో నిస్సాన్ మ్యాగనైట్ మోడల్ కి విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఈ మోడల్ లో ఎస్యూవీలో మంచి సేల్ అవుతున్న మోడల్. ఇది పెట్రోల్ వర్షన్ లో వస్తోంది. దీనిలో మాన్యూవల్, ఆటోమేటిక్ వర్షన్స్ ఉన్నాయి. 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 999సీసీ ఇంజిన్ తో ఈ మోడల్ వస్తోంది. 336 లీటర్ల బూట్ స్పేస్ అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.5.99 లక్షలు కాగా.. హైఎండ్ ప్రైస్ రూ.10.94 లక్షలుగా ఉంది.
హ్యూండాయ్ వెన్యూ కారుకు ఇప్పుడు చాలా మంచి డిమాండ్ ఉంది. క్రెటా కంటే కూడా ఇప్పుడు వెన్యూకే ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి. పైగా దీనికి సన్ రూఫ్ కూడా ఉంది. ఇందులో పెట్రోల్- డీజిల్, మాన్యూవల్- టోమేటిక్ వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. 1197 సీసీ నుంచి 1493 సీసీ వరకు అందుబాటులో ఉంది. దీని బేస్ మోడల్ ధర రూ.7.67 లక్షలు కాగా.. హై ఎండ్ ధర రూ.13.11 లక్షలుగా ఉంది.
టాటా కంపెనీ నుంచి ఎస్యూవీల్లో నెక్సన్ మోడల్ కి కూడా మంచి డిమాండ్ ఉంది. చాలా మందికి ఈ నెక్సన్ మోడల్ అంటే చాలా ఇష్టం. ఈ మోడల్ పెట్రోల్- డీజిల్ రెండు వేరియంట్స్ లో ఉంది. ఇందులో మాన్యువల్- ఆటోమేటిక్ ట్రాన్సిషన్స్ కూడా ఉన్నాయి. పెట్రోల్ వర్షన్ 1199సీసీ, డీజిల్ వర్షన్ లో 1497సీసీగా ఉంది. మైలేజ్ 17.33 కిలోమీటర్ల నుంచి 24.07 కిలోమీటర్లవ వరకు వస్తుందని చెబుతున్నారు. 350 లీటర్స్ బూట్ స్పేస్ లభిస్తోంది. దీని బేస్ మోడల్ ధర రూ.7.79 లక్షలు కాగా హైఎండ్ మోడల్ ధర రూ.14.34 లక్షలుగా ఉంది. ఏ మోడల్ కారు కొన్నా మైలేజ్, ధర, డిస్కౌంట్స్ తో పాటుగా.. భద్రతా ప్రమాణాల గురించి తప్పకుండా అడిగి తెలుసుకోండి.