గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలు చాలా సులభతరం అయ్యాయి. బ్యాంకు కి వెళ్లి క్యూ లైన్లో నిలబడి డబ్బులు డ్రా చేసే రోజులు చాలా వరకు పోయాయి. ఎక్కడైనా డిజిటల్ పేమెంట్స్.. ఏటీఎం కార్డుతో ఎప్పుడంటే అప్పుడు తమ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఆస్వాదిస్తున్నా జనాలు. తాజాగా ఏటీఎం కార్డ్ వినియోగదారులకు బ్యాంకులు భారీ షాకిచ్చాయి. వివరాల్లోకి వెళితే..
ఏటీఎంలలో లావాదేవీలపై పదిహేడు రూపాయలు, ఆర్థికేతర లావాదేవీలకు ఆరు రూపాయాలు వసూలు చేయాలని పలు బ్యాంకులు నిర్ణయించాయి. ఆగస్టు 1వతేదీ నుంచి ఏటీఎం కేంద్రాల్లో జరిపే లావాదేవీలకు చార్జీలు విధించడానికి బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏటీఎం లో 5 ఫ్రీ ట్రాన్సాక్షన్‌ల కంటే ఎక్కువ సార్లు డబ్బులు డ్రా చేసుకుంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందే.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ మాసం నుంచి నెలవారీ అదనపు ట్రాన్సాక్షన్‌లపై రూ.21 వసూలు చేసుకోవచ్చని బ్యాంకులకు చెప్పింది. దాంతో ఈ ఏడాది జనవరి 1నుంచి ఏటీఎంలో అదనపు విత్ డ్రాపై రూ.21వసూలు చేస్తున్నాయి. తాజాగా మరోసారి ఆర్బీఐ ఏటీఎంలో మనీ విత్ డ్రాపై ఖాతాదారుల నుంచి బ్యాంకులు సర్వీస్ ఛార్జీలను వసూలు చేయాలని ఆదేశించింది.
ఏటీఎంలో ఆర్థిక లావాదేవీల విషయానికి వస్తే.. .. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని అన్ని ప్రధాన బ్యాంకులు ప్రతి నెలా కొంత పరిమిత సంఖ్య వరకు ఏటీఎంలలో ఉచిత లావాదేవీలను అనుమతిస్తున్నాయి. సంబంధింత బ్యాంక్ లో ఏటీఎం కార్డుతో 5 సార్లు ఆపై ట్రాన్సాక్షన్స్ జరిపితే ఇక అదనపు చార్జీలు బాదుడే. వేరే బ్యాంక్ లో నుంచి డబ్బులు డ్రా చేసేందుకు 3 ఫ్రీ ట్రాన్సాక్షన్‌లకు అనుమతి ఇస్తున్నాయి. పరిధిదాటితే చార్జీలు తప్పవు.
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంలు వివిధ రకాల ఏటీఎం ఛార్జీలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.