టెలికాం రంగంలో ప్రధానంగా రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఏదైనా ఒక కంపెనీ ఒక ఆఫర్ ప్రకటించింది అంటే.. మరొక కంపెనీ అంతకుమించిన ఆఫర్ తో కస్టమర్లను ఆకర్షించేలా సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతున్నాయి. గతంలో అన్ లిమిటెడ్ టాక్ టైమ్ తో యూజర్లను కట్టిపడేసిన ఈ కంపెనీలు..ఇపుడు ఓటీటీ రంగం వైపు యూజర్ల దృష్టి మళ్లిస్తున్నాయి. కరోనా మహమ్మారి వల్ల సినీ ప్రేక్షకులు.. థియేటర్స్ కంటే ఓటీటీ యాప్ లపై పరుగెడుతుండడంతో.. ఈ మూడు సంస్థలు ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్ అంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ జియో అన్ లిమిటెడ్ టాక్ టైమ్, డేటా, ఓటీటీలను ఫ్రీగా అందజేస్తుంది. దానికి పోటీగా ఇప్పుడు భారతి ఎయిర్ టెల్ సంస్థ ముందుకొచ్చింది.
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన యూజర్లకు శుభవార్త తెలిపింది. ఇతర టెలికాం సంస్థలకు పోటీగా తన యూజర్లకు ఆకట్టుకునేందుకు అదిరిపోయే ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఇతర టెలికాం సంస్థలు అందిస్తున్నట్లు గానే ఓటీటీ సేవలను ఉచితంగా అందించేందుకు సిద్దం అయ్యింది. దీర్ఘకాల వ్యాలిడిటీ ప్లాన్‌లో భాగంగా ఇప్పటి వరకు ఉన్న రూ.2999 రీఛార్జ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ అప్‌గ్రేడ్ చేసింది.
Get Disney+ Hotstar with an #Airtel recharge and unravel the mystery on your mobile screen! Click https://t.co/bzi3fUzRdW to know more. pic.twitter.com/nZkRzwEW50
— airtel India (@airtelindia) February 16, 2022
ఎయిర్‌టెల్ రూ.2999 ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే 356 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు, రూ.499 విలువ గల డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా పొందవచ్చు. ఇంకా వింక్ మ్యూజిక్, ఉచిత హలోట్యూన్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 వరకు క్యాష్‌బ్యాక్ లాంటి బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. నెలపాటు అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్ ఫ్రీ ట్రయల్‌ను కూడా అందిస్తోంది. అయితే, ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.3359 ప్లాన్ కింద కూడా ఇవే ప్రయోజనాలు ఉండడంతో.. ఈ ప్లాన్ ఎన్నిరోజులు అందుబాటులో ఉంటుంది అనేదానిపై మాత్రం స్పష్టత లేదు.