టెలికాం రంగంలో దిగ్గజ సంస్థగా ఎయిర్‌టెల్ గుర్తింపు పొందింది. వేగవంతమైన నెట్‌వర్క్ సామార్థ్యం కలిగి ఉండి.. కస్టమర్లకు సేవలు అందిస్తోంది. దేశంలో ఎయిర్‌టెల్, జియోల మధ్యనే గట్టి పోటీ నడుస్తుంటుంది. ఈ రెండు టెలికాం ఆపరేటర్లు కూడా.. వినియోగదారుల అభిరుచి.. అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. రకరకాల ప్లాన్స్, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఎయిర్‌టెల్.. తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్‌టెల్ సిమ్ వాడేవారు.. సులభంగా 8 లక్షల రూపాయల వరకు లోన్ పొందే అవకాశం ఉందని.. అది కూడా బ్యాంక్‌కు వెళ్లే పని లేకుండా.. మీ మొబైల్ నుంచే ఈ లోన్ పొందే అవకాశం కల్పిస్తుండటం గమనార్హం. మరి ఈ లోన్ ఎలా పొందాలి.. దాని ప్రాసెస్ ఏంటి వంటి పూర్తి వివరాలు..
ఎయిర్‌టెల్.. టెలికాం సర్వీసులతో పాటు.. బ్యాంకింగ్ సేవలు కూడా అందిస్తోన్న సంగతి తెలిసిందే. దీని కోసం ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్‌ను ప్రారంభించింది. అంతేకాక వేర్వేరు కంపెనీల భాగస్వామ్యంతో.. లోన్‌లు కూడా అందిస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్‌టెల్ కస్టమర్లు రూ. 8 లక్షల వరకు రుణం పొందొచ్చు. కనీసం రూ. 10 వేల నుంచి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ద్వారా ఆన్‌లైన్‌లోనే లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
ఎయిర్‌టెల్ సిమ్ కార్డు వాడే వారు మాత్రమే.. ఈ లోన్ పొందడానికి అర్హులు. లోన్ అప్రూవల్ కోసం ఎక్కువ రోజులు ఎదురు చూసే పని లేకుండా.. వెంటనే రుణం మంజూరు అవుతుంది. అలానే ఈ లోన్ అప్లికేషన్, శాంక్షన్ అనేది పూర్తిగా ఆన్‌లైన్ ప్రాసెస్. ఈ లోన్‌కు ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. మీరు ఈ లోన్ పొందేందుకు అర్హులైతే.. కేవలం 24 గంటల్లో డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతాయి. ఆ తర్వాత ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఈఎంఐ కట్ అవుతుంది.
అయితే ఎయిర్‌టెల్ నేరుగా ఇలా రుణాలు ఇవ్వడంలేదు. ఎయిర్‌టెల్ మధ్యవర్తిగా ఉంటూ.. పలు కంపెనీల భాగస్వామ్యంతో తన యాప్‌లో లోన్ సర్వీసులు ఆఫర్ చేస్తోంది. డీఎంఐ ఫైనాన్స్, మనీ వ్యూ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వంటి ఆర్థిక సంస్థలతో ఎయిర్‌టెల్ భాగస్వామ్యం కుదుర్చుకుని.. తన కస్టమర్లకు లోన్ సౌకర్యం కల్పిస్తోంది. ఇక ఎయిర్‌టెల్ సిమ్ వినియోగించేవారు.. ఈ లోన్ పొందాలని భావిస్తే.. ముందుగా వారు.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత ఓటీపీ సాయంతో లాగిన్ అవ్వాలి.
యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు.. కింద మానేజ్, పే, షాప్, డిస్కవర్, హెల్ప్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. దానిలో మీరు మీరు షాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇందులో మీకు చాలా ఆప్షన్లు ఉంటాయి. మీ మొబైల్ స్క్రీన్ మీద ఫస్ట్ వరుసలో.. మొదట పర్సనల్ లోన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఇలా మీరు పర్సనల్ లోన్ ఆప్షన్ మీద సెలక్ట్ చేసి.. క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మీకు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలు అవసరం అవుతాయి. క్రెడిట్ స్కోర్ బాగున్న వారికి లోన్ అప్రూవల్ ఈజీగా రావొచ్చు. అర్హత కలిగిన వారు సులభంగా లోన్ పొందొచ్చు. లోన్ అమౌంట్ అనేది మీ ఎలిజిబిలిటీ ప్రాతిపదికన మారుతుందని గుర్తించుకోవాలి. సిబిల్ స్కోర్ బాగుంటేనే.. లోన్ లభించే అవకాశం ఉంది. 10 వేల నుంచి 8 లక్షల వరకు రుణం మంజూరు అవుతుంది. మరి మీరు ఒకసారి ట్రై చేయండి. ఎయిర్‌టెల్ తీసుకువచ్చిన ఈ ఆప్షన్ మీకు ఉపయోగపడుతుందా లేదా.. అన్న దానిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.