బిగ్ బాస్ ఓటిటిలో కంటెస్టెంట్స్ మధ్య రోజురోజుకి వివాదాలు, మనస్పర్థలు పెరుగుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ కి ఆదరణ ఎలా ఉందో బయటికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇదివరకు టీవీ వెర్షన్ బిగ్ బాస్ షోకి వచ్చిన ఆదరణ ప్రస్తుతం ఓటిటి షోకి రావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. షోకి ఆదరణ ఎలా ఉన్నప్పటికీ వీకెండ్స్ లో జరిగే ఎలిమినేషన్స్, నామినేషన్స్ పై మాత్రం జనాలు ఆసక్తి కనబరుస్తునట్లు తెలుస్తుంది.
ఇక బిగ్ బాస్ లో మొదటివారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిపోయింది. తాజాగా బిగ్ బాస్ నామినేషన్స్ ప్రోమో వదిలారు నిర్వాహకులు. ఈ ప్రోమో చూస్తుంటే.. యాంకర్ శివకి ఇంట్లో చాలామందితో వివాదాలు ఉన్నట్లు తెలుస్తుంది. నామినేషన్స్ లో భాగంగా యాంకర్ శివకి, సీనియర్ కంటెస్టెంట్ అఖిల్ కి మధ్య జరిగిన సంభాషణలు హైలైట్ అవుతున్నాయి. ఈ క్రమంలో అఖిల్.. శివని నామినేట్ చేస్తూ.. ‘ఇంట్లో ఉండాలంటే అర్హత ఉండాలి.. నీకు నీ మీద నమ్మకం లేకపోతే ఇంట్లో ఉండి వేస్ట్. కాంట్రవర్సి శివ ఉండొచ్చు.
అదే కాంట్రవర్సి నాకు ఎక్కడ కూడా నీ గేమింగ్ లో కనిపించడం లేదు. కాంట్రవర్సీ అని పేరు పెట్టుకున్నావు.. కానీ గేమ్ అలా ఆడట్లేవు’ అన్నాడు. ఇక రిటర్న్ గా శివ అఖిల్ ని నామినేట్ చేస్తూ.. ‘శివ నాకిక్కడ కనిపించడం లేదు అన్నావ్.. నా విధానం ఇంతే బ్రో’ అంటూ సీరియస్ అయ్యాడు. అలాగే సరయుని కూడా శివ హర్ట్ చేశాడని నామినేట్ చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఏం జరగనుందో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నామినేషన్స్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ లో తెలియజేయండి.