బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ఎదురుచూసే ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందిస్తూనే ఉంది డిస్నీ హాట్ స్టార్ యాజమాన్యం. ఇప్పటివరకు 5 టీవీ సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు ఓటిటి వెర్షన్ తో ప్రేక్షకులను 24 గంటలపాటు ఎంటర్టైన్ చేయబోతుంది. బిగ్ బాస్ తెలుగు ఓటిటి షోగా ప్రారంభం కానున్న కొత్త సీజన్ కి సంబంధించి లేటెస్ట్ ప్రోమోలు సందడి చేస్తున్నాయి.
ఇక ఫిబ్రవరి 26న బిగ్ బాస్ ఓటిటి సీజన్ ప్రారంభం కానుండటంతో.. ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేందుకు 5 రోజులే ఉందంటూ కొత్త ప్రోమో వదిలారు నిర్వాహకులు. ఈ సరికొత్త ప్రోమోలో హోస్ట్ అక్కినేని నాగార్జున.. ‘బిగ్ బాస్ లో ఇక నో కామాస్, నో ఫుల్ స్టాప్స్.. బిగ్ బాస్ ఇప్పుడయ్యింది నాన్ స్టాప్’ అంటూ షోపై ఆసక్తి రెట్టింపు చేశాడు. ఇక బిగ్ బాస్ ఓటిటిలో 18 మంది కంటెస్టెంట్స్ గా రాబోతున్నారు.
ప్రస్తుతం ఓటిటి సీజన్ లో పాల్గొనే 18 మంది ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం అందరిలో నెలకొంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానున్న బిగ్ బాస్ ఓటిటి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.