బిగ్ బాస్ రియాలిటీ షో.. ఇప్పటివరకు తెలుగులో 5 సీజన్లు విజయవంతంగా ప్రదర్శితం అయింది. ముఖ్యంగా టీవీ ప్రేక్షకులకు దగ్గరైన బిగ్ బాస్ షో.. ఇప్పుడు ఓటిటి రూపంలో 24 గంటలు అలరించేందుకు సిద్ధం అవుతోంది. బిగ్ బాస్ ఓటిటి సీజన్ కి సంబంధించి ప్రతిరోజూ సరికొత్త ప్రోమోలు కూడా రిలీజ్ చేస్తున్నారు నిర్వాహకులు. అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేయనున్న బిగ్ బాస్ ఓటిటి పై ప్రేక్షకులలో అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
ఫిబ్రవరి 26 నుండి బిగ్ బాస్ తెలుగు ఓటిటి సీజన్.. డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతుండగా.. తాజాగా బిగ్ బాస్ యాజమాన్యం కొత్త ప్రోమో(4 days to go) వదిలింది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ హౌజ్ ను చాలా గ్రాండ్ గా పరిచయం చేయబోతున్నారని అర్థమవుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ లో అడుగుపెట్టనున్న కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. ఈసారి 18 మంది కంటెస్టెంట్స్ పాల్గొనబోతున్నారు. మరి ఫిబ్రవరి 26న సాయంత్రం 6గంటల సమయంలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ ఓటిటి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.