‘బిగ్ బాస్ ఓటీటీ’ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. నో కామా, నో పుల్ స్టాప్ అంటూ మొదలైనా కూడా.. కాస్త బ్రేక్ పడిన విషయం తెలిసిందే. మళ్లీ లైవ్ స్ట్రీమింగ్ మొదలైంది. గత సీజన్ల మాదిరిగా ఎపిసోడ్లు కూడా పెడుతున్నారు. ప్రతి టాస్కు, ప్రతి విషయం వారియర్స్ Vs ఛాలెంజర్స్ గానే డిజైన్ చేస్తున్నారు. అందులో భాగంగా వారి మధ్య చెలరేగుతున్న వివాదాలు, ఆ డ్రామా సదరు ఆడియన్ ను బాగా అలరిస్తోంది. ముఖ్యంగా ఇది వారియర్స్ కు అగ్ని పరీక్ష అనే చెప్పాలి.
బిగ్ బాస్ ప్రతి విషయంలో వారియర్స్ గత అనుభవాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో సీనియర్స్ తమ సీక్రెట్స్ ను బయట పెట్టక తప్పడం లేదు. ఓ టాస్కులో అఖిల్ కూడా తన గత సీజన్ అనుభవాలను, అప్పుడు అతను చేసిన తప్పుల గురించి ఓపెన్ అయ్యాడు. ‘బిగ్ బాస్- 4లో సీజన్ మొత్తం నవ్వకుండా.. చాలా సీరియస్ గా ఉన్నాను. ఆ సీజన్ మొత్తంలో నేను నవ్వకపోవడమే నాకు పెద్ద మైనస్ అయ్యింది. నా ఆట నేను చూసుకున్నప్పుడు అదే అనిపిచింది. ఇప్పుడు మాత్రం ఆ తప్పు చేయాలనుకోవడం లేదు’ అన్నాడు.
ఛాలెంజర్స్ సభ్యుడు అనీల్ రాథోడ్.. మోనాల్ తో ఉన్న లవ్ ట్రాక్ గురించి నేరుగా ప్రశ్నించాడు. అప్పుడు వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి కూడా ఓపెన్ అయ్యాడు. ‘మోనాల్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఫ్రెండ్ షిప్ లో నేను చాలా పొసెసివ్. బయటకు వచ్చాక ఇంకా క్లోజ్ అయ్యాము. మా మధ్య ఇప్పటికీ ఆ బాండింగ్ అలాగే ఉంది’ అని వారిది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడు. కానీ, అఖిల్ మాటలను మాత్రం ప్రేక్షకులు నమ్మేలా లేరు. నిజంగా అఖిల్- మోనాల్ మధ్య ఉన్నది స్నేహమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.