హీరోయిన్ తమన్నా తన రిలేషన్ పై ఫస్ట్ టైం స్పందించింది. నటుడు విజయ్ వర్మతో లవ్ అంటూ వస్తున్న రూమర్స్ పై స్పందించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి.
సినీ ఇండస్ట్రీలో రిలేషన్ షిప్స్ చాలా నార్మల్ విషయం. బయటకు చెప్పినా చెప్పకపోయినా సరే హీరోహీరోయిన్లు, నటీనటులు అప్పుడు ప్రేమ వ్యవహారం నడిపిస్తుంటారు. కలిసి పార్టీలు చేసుకోవడం లాంటివి కూడా చేస్తుంటారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో బయటకొస్తే.. వారి రిలేషన్ గురించి సోషల్ మీడియా అంతా కూడా టామ్ టామ్ అయిపోతుంది. అలా ఈ మధ్య కాలంలో న్యూస్ లో హాట్ టాపిక్ అయిన జంట ఏదైనా ఉందా అంటే తమన్నా- విజయ్ వర్మనే. అయితే ఈ రిలేషన్ పై కొన్నిరోజుల ముందు విజయ్ క్లారిటీ ఇవ్వగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమన్నా కూడా ఓపెన్ అయిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఇప్పటికే చాలాసార్లు పెళ్లి న్యూస్ వచ్చింది కానీ డేటింగ్ విషయమై మాత్రం ఎలాంటి గాసిప్ లేదా రూమర్ రాలేదు. కరెక్ట్ 2023 న్యూయర్ సందర్భంగా హీరోయిన్ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మని లిప్ లాక్ చేస్తున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందని తెగ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఎయిర్ పోర్ట్ లోనూ కలిసి కనిపించడంతో ఆల్మోస్ట్ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఫిక్సయిపోయారు. కానీ ఇద్దరిలో ఎవరూ కూడా నోరు విప్పలేదు. వాలంటైన్స్ డే సందర్భంగా కాళ్లు మాత్రమే కనిపించేలా ఓ ఫొటో పోస్ట్ చేసిన విజయ్.. తమన్నాతో రిలేషన్ లో ఉన్నానంటూ హింట్ ఇచ్చేశాడు.
అయితే విజయ్ రిలేషన్ పై ఇంతవరకు స్పందించని తమన్నా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడింది. మీడియాకు కాస్త ఘాటుగానే సమాధానమిచ్చింది. ‘మేమిద్దరం కలిసి ఓ మూవీలో యాక్ట్ చేశాం. అప్పటి నుంచి మాపై రూమర్స్ ప్రచారం చేస్తున్నారు. దీనిపై అందరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని తమన్నా చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి చూస్తుంటే అవునని చెప్పలేదు. అలా అని విజయ్ తో రిలేషన్ లో లేనని కూడా చెప్పలేదు. ఇదిలా ఉండగా తమన్నా ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్’, రజనీకాంత్ ‘జైలర్’లో హీరోయిన్ గా చేస్తోంది. సరే విజయ్ తో రిలేషన్ పై తమన్నా ఇచ్చిన క్లారిటీపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.