బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కి ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ కావడంతో.. ఎమోషన్స్ తో ప్రేక్షకుల హృదయాలను పిండేస్తున్నారు. నిజానికి ఏ సీజన్ అయినా కూడా ఫ్యామిలీ వీక్ అంటే రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది. పైగా ఈసారి అందరి స్టోరీలు బాగా ఎమోషనల్ గా ఉండటంతో ఇంకా బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పటి వరకు రీచ్ లేదని బాధపడుతున్న వారికి ఈ వారం జాక్‌పాట్‌లా మారిపోయింది. ఆదిరెడ్డి మొదలు అందరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు అంతా ఎమోషనల్ అయిపోయారు. ఫైమా తల్లి రావడం, ఇనయా సుల్తానా వాళ్ల అమ్మ వచ్చి ఆమెను క్షమించడం అన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
తాజాగా రేవంత్ వాళ్ల అమ్మ ఇంట్లోకి వచ్చారు. తల్లిని చూసి రేవంత్ ఎంతో ఎమోషనల్ అయిపోయాడు. అమ్మ చెప్పిందని వెంటనే గడ్డం తీసేసి స్మార్ట్‌గా తయారయ్యాడు. అయితే హౌస్‌లో కీర్తీ భట్ ఒక్కతే నాకు ఎవరూ లేరు అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ ఉండేది. అందరి కుటుంబ సభ్యులు వచ్చినప్పుడల్లా ఎంతో భావోద్వేగానికి లోనవుతూ ఉండేది. ఆమెకోసం కో స్టార్ మహేశ్‌బాబు కాళిదాసు హౌస్‌లోకి వచ్చాడు. ఆమెను ఎంతో సర్‌ప్రైజ్ చేశాడు. కానీ, ఒక తల్లిదండ్రుల ఆప్యాయతను అయితే కీర్తీ భట్‌కి అందించలేకపోయాడు అనేమాట వాస్తవం. బిగ్ బాస్‌లో అడుగుపెట్టిన తర్వాత కీర్తీకి తల్లిదండ్రులు లేరు అనే బాధ అయితే ఉండదనే చెప్పాలి. ఆమెకు ఇక్కడ పెద్ద ఫ్యామిలీ దొరికింది.
అయితే రేవంత్ వాళ్ల తల్లి ఎంతో మంచి మనసు చాటుకుంది. కీర్తీ భట్‌ని దగ్గరకు తీసుకుని సొంత కూతురిలా లాలించింది. వేలు ఇంకా తగ్గలేదా అంటూ ఆప్యాయంగా పలకరిచింది. అంతేకాదు.. కీర్తీ ఇలారా ఎందుకు నువ్వు ఎవరూ లేరని అనుకుంటావు. నువ్వు నా కూతురులాంటి దానివి. కాదు.. నా కూతురివే నువ్వు. అంటూ కీర్తీ దగ్గరకు తీసుకుని హత్తుకుంటుంది. రేవంత్ తల్లి చెప్పిన మాటలకు కీర్తీ భట్ ఎంతో ఎమోషనల్ అయిపోయింది. ఇంతకముందు శ్రీసత్య వాళ్ల తల్లిదండ్రులు కూడా కీర్తీని అలాగే ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. నువ్వు కూడా మా కూతురివే.. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా దగ్గరకు రావొచ్చు. మాకు ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ఉంది. నీకు ఒక గది ఇస్తాం వచ్చేయ్ అంటూ చెప్పుకొచ్చారు. బిగ్ బాస్‌కి వచ్చినందుకు కీర్తీకి ఒకటి కాదు.. చాలా కుటుంబాలు దొరికాయి అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.