బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోందనే చెప్పాలి. ఎందుకంటే మొదటి రోజు నుంచి ఇప్పటివరకు గొడవలేని రోజు లేదు. డిస్కషన్ జరగని పూట లేదు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు వారిలో వాళ్లు తెగ కొట్టేసుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ అంటేనే మిమ్మల్ని సాధ్యమైనంత వరకు కష్టాలు పెట్టి, మిమ్మల్ని ఎమోషనల్ గా డిస్టర్బ్ చేసి అసలు మీరు ఎవరు అనేది బయటకు తీయటమే ఆ కాన్సెప్ట్ అంతరార్థం. అది తెలిసి కూడా సెలబ్రిటీలు లోపలికి వెళ్లి నానా తిప్పలు పడుతూ ఉంటారు. కొంతమంది తమ నిజ స్వరూపాన్ని దాచిపెట్టి నటించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తారు. కానీ, అది కొన్నిరోజులు మాత్రమే కొనసాగుతుంది. ఎప్పటికైనా బయటకు రావాల్సిందే.
అందరూ కర్మ సిద్ధాంతం నమ్ముతారు కదా.. అది బిగ్ బాస్ హౌస్‌లో రుజువైందంటూ ఇప్పుడు రేవంత్ ఫ్యాన్స్ చెబుతున్నారు. అద ఎవరి విషయంలో అంటారా? అదే ఫైమా విషయంలో అండి. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నడుస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి టాస్కులో చంటి, రెండో టాస్కులో ఇనయా సుల్తానా, మూడో దాంట్లో రాజశేఖర్, నాలుగో టాస్కులో ఆర్జే సూర్య విజయం సాధించి.. కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. వీళ్లతోపాటుగా అర్జున్ కల్యాణ్, ఆరోహీ రావు, ఫైమా, కీర్తీ భట్, షానీ లాంటి వాళ్లు వివిధ రౌండ్లలో తలపడి ఓడిపోయారు. వీళ్లందరిలో ఫైమా మాత్రం బెడ్ రూమ్‌లో కూర్చొని తెగ ఏడ్చేసింది. ఎందుకు ఏడుస్తున్నావ్ అని కీర్తీ భట్ ప్రశ్నించగా.. తనకు అన్యాయం జరిగిందంటూ చెప్పుకొచ్చింది.
“నేను ఎంతో కష్టపడి ఆడాను. ఈ రౌండ్‌లో నన్ను కావాలనే పక్కన పెట్టేశారు అనిపిస్తోంది. నేను రెండు సార్లు కూర్చున్నాను, చేయి ఇలా పెట్టాను అది నాకు కూడా తెలుసు కానీ, నేను ఒకటి, రెండుసార్లు మాత్రమే అలా పెట్టాను. కానీ అందుకే నన్ను డిస్కాలిఫై చేసి పక్కకు పంపేశారు. అసలు గేమ్ ఆడదామంటే నా బొమ్మ కూడా లేదు. నా బొమ్మని అభినయశ్రీ తీసుకెళ్లిపోయింది” అంటూ ఫైమా వెక్కి వెక్కి ఏడ్చేసింది. అయితే ఇప్పుడు రేవంత్ ఫ్యాన్స్.. “మొదటి రౌండ్లో నువ్వు నీ బోర్డులో ఉన్న ఒక్క షేప్ ఇచ్చి ఉంటే రేవంత్ గెలిచేవాడు. కానీ, నువ్వు నీ స్వార్థం కోసం అలాంటి గేమ్ ఆడావు. కానీ, తర్వాత నువ్వు అడగ్గానే రేవంత్ నీకు హెల్ప్ చేశాడు. కానీ, కర్మ ఫలితం ఎక్కడకు పోతుంది?” అంటూ రేవంత్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఫైమా గేమ్ ప్లేపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.