బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండోవారం వీకెండ్ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. హౌస్‌లోని సభ్యులు మొత్తం నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆందోళనలో ఉన్నారు. మొదటి వారం ఎలిమినేషన్ లేకపోవడం కూడా ఈ వారంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా నామినేషన్స్ లో ఉన్న రేవంత్, గీతూ, ఆదిరెడ్డి, అభినయశ్రీ, రోహిత్-మెరీనా, రాజశేఖర్, షానీ, ఫైమాలు నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఇద్దరు ఎలిమినేట్ కావొచ్చనే టాక్ బాగా వినిపిస్తోంది. అది కూడా అభినయశ్రీ, షానీ ఎలిమినేట్ కానున్నట్లు అభిప్రాయాలు, రూమర్స్ కూడా వస్తున్నాయి.
ఇంక ఎలిమినేషన్స్ విషయాన్ని పక్కనపెడితే శుక్రవారం జరిగిన ఫన్నీ టాస్క్ పై ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీమ్ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసింది. సుధీర్ బాబు- కృతిశెట్టి హౌస్‌మేట్స్ కి ఫన్నీ టాస్క్ ఇచ్చారు. అందులో రేవంత్.. మహేశ్ బాబుని ఇమిటేట్ చేయగా గీతూ రాయల్ బుజ్జిగాడు స్టైల్‌లో డైలాగ్ దంచికొట్టింది. ఇంక ఆర్జే సూర్య మాత్రం పవన్ కల్యాణ్ వాయిస్ దించేశాడు. సుధీర్ బాబు సైతం ఆ మిమిక్రీకి ఫిదా అయిపోయాడు. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు శ్రీ సత్యకు ఇవ్వగా.. బెస్ట్ యాక్టర్ అవార్డు శ్రీహాన్‌కి ఇచ్చారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. శ్రీహాన్- ఫైమా చేసిన స్కిట్‌పై విమర్శలు, ట్రోలింగ్ జరుగుతోంది.
ఫైమా గురించి అందరికీ తెలిసిందే. ఒక స్టాండప్ కమెడీయన్‌గా, జబర్దస్త్ లాంటి షోలో తానేంటో నిరూపించుకుంది. ఆడియన్‌గా పటాస్ షోలో పాల్గొని తర్వాత కమెడియన్‌గా అవకాశం అందిపుచ్చుకుంది. అక్కడి నుంచి కెరీర్ బిల్డ్ చేసుకుంటూ వచ్చిన ఫైమా.. ఇప్పుడు బిగ్ బార్ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. హౌస్‌లోనూ తనదైనశైలిలో పంచులు వేస్తూ నవ్వించింది. కానీ, శ్రీహాన్ తో చేసిన స్కిట్ లో మాత్రం ఆమె బూతు కామెడీ చేసిందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. పోకిరి లిఫ్ట్ సీన్ రీక్రియేట్ చేసిన వీళ్లు దానిని బాత్‌రూమ్ స్కిట్‌గా మార్చేశారు. అంతేకాకుండా ఫైమా నీకు ఉందా? అని అడిగిన ప్రశ్న డబుల్ మీనింగ్‌లోనే కాదు, వల్గర్‌గా ఉందంటూ చురకలు అంటిస్తున్నారు. ఫైమా- శ్రీహాన్ స్కిట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.