బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈ సీజన్‌లో జరిగినంత డ్రామా, సీజన్‌పై వచ్చినంత నెగిటివిటీ ఎప్పుడూ రాలేదు. ఎందుకో ఇంట్లో ఉన్న సభ్యులు కూడా అలాగే ఉన్నారు. ఒక్కరూ కప్పు కోసం ఆడుతున్నాం అనే నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. గత సీజన్లలో ఎందుకు ఇంత ప్రాణం పెట్టి ఆడుతున్నారు? అని ఆశ్చర్యపోయిన ప్రేక్షకులు వీళ్లు అసలు ఆడటానికేనా వచ్చింది? అని ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఈ సీజన్లో కాస్తో కూస్తో షో మీద ఇంట్రస్ట్ తెపపించిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారా అంటే ఆమే గీతూ రాయల్. ఆమె మొదట్లో నెగెటివిటీని మూటకట్టుకున్నా కూడా.. తర్వాత తర్వాత అభిమానుల నమ్మకాన్ని పొందింది. గీతక్క టాప్-5 కన్ఫమ్ అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి.
అయితే ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అభిమానులు, గీతూ రాయల్ అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 నుంచి గీతక్కని ఎలిమినేట్ చేశారు. అవును మీరు చదివింది కరెక్టే 9వ వారం గీతూ రాయల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇటీవల చంటి ఎలిమినేషన్ మరువక ముందే.. గతవారం ఆర్జే సూర్యను ఎలిమినేట్ చేసినప్పుడే అంతా ఏంటి ఈ షాకింగ్ ఎలిమినేషన్ అని అంతా నోరెళ్లబెట్టారు. ఇప్పుడు అంతకంటే ఎక్కవ షాకింగ్ ఎలిమినేషన్ ఇది అని చెప్పాలి. ఎందుకంటే గీతూ పక్కా టాప్ 5 కంటెస్టెంట్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ, బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేషన్‌తో అందరికి బిగ్ షాకిచ్చాడు. అయితే ఈ ఎలిమినేషన్ వెనుక బిగ్ స్కెచ్ ఉందనే చెబుతున్నారు. అవును అకారణంగా ఏమీ గీతూని ఎలిమినేట్ చేయలేదంట. కావాలనే చేశారని చెబుతున్నారు.
అవును.. గీతూ రాయల్ కు ఎంత మంచి పేరుందో.. అంతకంటే ఎక్కువ నెగిటివిటీ ఉంది. గీతూ పేరు చెప్పగానే అబ్బో ఆమెనా అనే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. గీతూ అంతా ప్రాక్టికల్ మనిషి. నిజానికి వందరోజులు ఇంట్లో కలిసి ఉంటే ఎవరూ నా కుటుంబం అని అనుకోరు. అది ఇంట్లో ఉన్నన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అదే విషయాన్ని గీతూ కూడా ఉన్నది ఉన్నట్లు చెప్పేసింది. అప్పటి నుంచి ఆమె మీద నెగెటివ్ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. అలాగే యుద్ధంలో ప్రేమలో ఏం చేసినా కరెక్టే అనే నానుడి ఉంది. అదే విషయాన్ని గీతూ తన స్టైల్‌లో చెప్పింది. గెలవడానికి ఏదైనా చేస్తాను.. ఎలాగైనా గెలవడమే నాకు ముఖ్యం అని. అయితే కొన్ని వారాల తర్వాత గీతూకి ఫ్యాన్ బేస్ పెరిగింది. మళ్లీ స్వయంకృతరాపధాల వల్ల తన ఫ్యాన్స్ ని కోల్పోయింది. మళ్లీ నెగెటివ్ కామెంట్స్ వచ్చేలా చేసింది.
ఇటీవలికాలంలో గీతూ గేమ్ చూసుకుంటే.. హోస్ట్ నాగార్జున కూడా ఆమెని నిల్చోబెట్టి కడిగేశాడు. ఫిజికల్ గేమ్‌లో ఇరగదీస్తానంటూ బోల్తాపడింది. అంతేకాకుండా బిగ్ బాస్ రూల్స్ కి వ్యతిరేకంగా తన సొతం రూల్స్ పెట్టింది. అవన్నీ హౌస్‌లోనే కాదు.. ప్రేక్లకుల్లోనూ వ్యతిరేకత వచ్చేలా చేశాయి. ఏం మాట్లాడినా రూల్ ఉందా అనే గీతూ.. ఆ రూల్స్‌ని బ్రేక్ చేస్తూ గేమ్ ఆడటం ఎవరికీ నచ్చలేదు. నాగార్జున కూడా బొచ్చులో ఆటలా ఉందన్నాడు. అలాగే టాస్కు కోసం పదే పదే బాలాదిత్య వీక్‌నెస్ తో ఆడుకోవడాన్ని అంతా తప్పుబడుతున్నారు. రెండు స్ట్రిప్పులు ఇస్తే లైటర్ ఇస్తాను.. రెండు స్ట్రిప్పులిస్తే సిగిరెట్ ఇస్తానంటూ ఆడుకున్నారు. బాలాదిత్య ఏడుపు గీతూకి మరింత నెగెటివ్ అయ్యింది.
ఇంకా ఆదిరెడ్డి లేస్తే.. గీతక్క అంటూ వెనుక తిరిగుతూ ఉంటాడు. ఆమె ఎంతో స్ట్రాంగ్ అని, ఎవరు తప్పుగా మాట్లాడినా కూడా గీతూతో ఫ్రెండ్‌షిప్ చేశాడు. అలాంటి ఆదిరెడ్డిని కూడా గీతూ వెన్నుపోటు పొడిచేందుకు పథకం పన్నింది. అతని టీషర్ట్ దాచేసి గెలవాలని చూసింది. అయితే ఆదిరెడ్డి ఆ విషయంలో చాలా హర్ట్ అయ్యాడు. ఏదో ఒకరోజు కళ్లనీళ్లు తెప్పిస్తా.. ఆ రోజు నా దెబ్బ ఏంటో నీకు తెలుస్తది అంటూ ఛాలెంజ్ చేశాడు. అలాంటి ఘటనలు ఇంకా ఇంట్లోని సభ్యులతో అయితే కోకొల్లలు. అలాంటి గీతూని ఇంక హౌస్‌లో ఉంచకూడదని బిగ్ బాస్ భావించడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గీతూ షోకి ప్లస్ అయ్యిందని భావించిన బిగ్ బాసే.. ఆమె ఉంటే షోకి నెగెటివిటీ వస్తోందని భావించి ఎలిమినేట్ చేసుంటాడని చెబుతున్నారు. కారణాలు ఏమైనా.. గీతూ రాయల్ ఇంత త్వరగా హౌస్ నుంచి రావాల్సిన సభ్యురాలు అయితే కాదు. మరి.. గీతూ ఫ్యాన్స్ ఈ ఎలిమినేషన్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.