బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈ రియాలిటీ షో సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగిపోయింది. షో దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఆసక్తి కూడా రెట్టింపు అవుతోంది. ఇప్పటికే పాల్గొనే సభ్యులు, వారి రెమ్యూనరేషన్ అంటూ చాలానే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి స్టేజ్ మీద నాగార్జున ఇంట్రడ్యూస్ చేసే వరకు ఎవరు హౌస్‌లోకి వెళ్తారు అనేది మాత్రం ఎవరూ చెప్పలేరు.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6కి సంబంధించిన ప్రోమోలు, నాగార్జున ఇంట్రడక్షన్ సీన్లు అన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ రానే వచ్చింది. అదేంటంటే ఈ సీజన్లో హౌస్ ఎలా ఉండబోతోంది అనేది ఒక క్లారిటీ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఒక గ్లిమ్స్ ని విడుదల చేశారు.
ఆ వీడియోలు, ఫొటోలు చూస్తుంటే ఆరో సీజన్‌లో హౌస్ ఎంతో కొత్తగా కనిపిస్తోంది. గడిచిన 5 సీజన్ల కంటే ఈసారి బిగ్ బాస్ హౌస్ సరికొత్త లుక్‌లో కనిపిస్తోంది. సభ్యులను సైతం ఎంతో జాగ్రత్తగా, మంచి ఫేమ్ ఉన్న వారిని ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎంటర్‌టైన్మెంట్ కూడా డబుల్ డోస్‌లో ఉండబోతోందని చెబుతున్నారు. మరోవైపు హోస్ట్ నాగార్జున లుక్స్ గురించి కూడా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
ఇటీవలే 63వ జన్మదిన వేడుక జరుపుకున్న అక్కినేని నాగార్జున.. సీజన్ మారే కొద్దీ ఇంకా యంగ్‌గా కనిపిస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా నాగార్జున రెమ్యూనరేషన్ కు సంబంధించిన ఒక వార్త కూడా బాగా వైరల్ అవుతోంది. అందేంటంటే.. ఈ సీజన్ కోసం నాగార్జున దాదాపు రూ.15 కోట్ల వరకు అందుకోనున్నారంట. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌస్ లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.