ఈసారి బిగ్ బాస్.. గత సీజన్లతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంది. కంటెస్టెంట్స్ హౌసులోకి వచ్చినప్పుడు రేవంత్ తప్పించి.. మిగతా ఎవరూ కూడా పెద్దగా ప్రేక్షకులకు తెలియదు. అలాంటి టైంలో తమని తాము ఆడియెన్స్ కి అలవాటు కావాలంటే గేమ్ ఎంతో ఫెర్ఫెక్ట్ గా ఆడాలి. ప్రతివారం కూడా నామినేషన్స్ గండం నుంచి బయటపడాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుత సీజన్ లో గీతూ, ఆదిరెడ్డి లాంటి బిగ్ బాస్ రివ్యూయర్స్ కూడా కంటెస్టెంట్స్ గా వచ్చారు. ఈ ఇద్దరికీ కూడా మిగతా హౌస్ మేట్స్ తో పోలిస్తే.. గేమ్ గురించి కాస్త ఎక్కువ ఐడియా ఉంది. అందులో భాగంగానే హౌసులో తమ మార్క్ చూపిస్తూ వచ్చారు. అయితే గీతూ కొన్ని వారాల క్రితం ఎలిమినేట్ కాగా.. ఆదిరెడ్డి మాత్రం ఫైనల్ వరకు వచ్చేశాడు. మరో రెండు రోజులు ఆగితే టాప్-5లో ఉంటాడా లేదా అని తెలిసిపోతుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ ఆరో సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇనయ, ఆదివారం ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి మాత్రమే ఉన్నారు. అలానే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉందని హోస్ట్ నాగార్జున బాంబు పేల్చాడు. దీంతో హౌస్ నుంచి బయటకెళ్లిపోయే వ్యక్తి ఎవరా అని అందరూ తెగ టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలోనే సుమన్ టీవీ, ఆదిరెడ్డి చెల్లెలు నాగలక్ష్మిని ఇంటర్వ్యూ చేసింది. ఇందులో భాగంగా పలు ఆసక్తికర విషయాల్ని బయటపెట్టింది. అన్న ఆదిరెడ్డి అంటే ఎంత ప్రేమో, వదిన కవితతో ఉన్న బాండింగ్ గురించి నాగలక్ష్మి రివీల్ చేసింది. ఇక తన యూట్యూబ్ ఛానెల్ గురించి కూడా మాట్లాడింది.
‘బిగ్ బాస్ షో అంటే పిచ్చి. ఐదేళ్ల నుంచి చూస్తున్నాం. అన్న ఆదిరెడ్డి రివ్యూ చెబుతున్నాడు. చిన్నప్పుడు బాగా గొడవపడేవాళ్లం. అన్న నన్ను బాగా కొట్టేవాడు. కానీ దీనిలో ఎక్కువ ప్రేమ ఉంటుంది. మా అమ్మ చనిపోయాక.. అమ్మ ప్రేమని ఎలా పంచాలో అన్నకు బాగా తెలుసు. అలానే నా విషయంలో తండ్రి స్థానం తీసుకున్నాడు. అన్నా వదిన నా రెండు కళ్లు. అలానే రాఖీ కడితేనే ప్రేమ ఉంటుంది అంటే నేను ఒప్పుకోను. కానీ ఈసారి రాఖీ పండక్కి ముందే నాకు అన్నయ్య, చైన్ ని సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. 2020లో నేను-వదిన కలిసి యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాం. ఈ సక్సెస్ కు కారణం ఆదిరెడ్డి. ఇక బిగ్ బాస్ హౌసులో అన్నయ్య చాలా బాగా ఆడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇది నాకు చాలా గర్వంగా ఉంది.’ అని నాగలక్ష్మి చెప్పింది.