బిగ్ బాస్ హౌసులో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. వీకెండ్ వచ్చిందంటే చాలు అంటే కచ్చితంగా ఒకరు, హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. తొలివారం ఎవరినీ పంపించలేదు. రెండోవారం మాత్రం ఏకంగా అభియన, షానీ అంటే డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇక మూడో వారం ఎలిమినేషన్ కి టైమ్ వచ్చేసింది. ఇప్పుడు కూడా ఓ లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రేక్షకుల అంచనాలకు, బిగ్ బాస్ నిర్ణయానికి అసలు సంబంధమే ఉండదు. గత సీజన్లలో ఎలిమినేషన్ ట్విస్టులతో అనుకున్న వారికంటే వేరే వాళ్లు బయటకు వచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా సేమ్ అలాంటిదే జరిగిందట.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ వారం ఏకంగా 10 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారిలో సుదీప, ఆరోహి, ఇనయా, వాసంతి, నేహా, గీతూ, చంటి, శ్రీహాన్, రేవంత్, బాలాదిత్య ఉన్నారు. అయితే బిగ్ బాస్ మూడో వారం ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వారం ఇనయా ఎలిమినేట్ అని తొలుత వార్తలొచ్చాయి. కానీ ఈ వారం మొత్తం ఇయన ఫుల్ ఫుటేజీ ఇచ్చింది. కెప్టెన్సీ టాస్కులోనూ చాలా కష్టపడింది. కానీ దురదృష్టం ఆమెని వెంటాడింది. పిట్ట అని తనని అన్నాడని శ్రీహాన్ ని వెంటాడి వెంటాడి మరీ ఆడుకుంది.
మరోవైపు వాసంతి కూడా తనకు తాను ఎలిమినేట్ అయిపోతననేలా మాట్లాడుతూ వచ్చింది. అయితే ఇక్కడే బిగ్ బాస్ మూడోవారం ఎవ్వరూ ఉహించని విధంగా నేహాని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. తన నసతో చెప్పిందే చెప్పి, అదే పాయింట్ ని తిప్పి తిప్పి చెబుతూ చిరాకు తెప్పిస్తున్న నేహానే ఈ వారం ఎలిమినేట్ అయిందని తాజా సమాచారం. మంచిగా ఆడుతున్న ఇనయా కంటే నేహానే బయటకు పంపించేయడమే కరెక్ట్ అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి నేహా ఎలిమినేట్ అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: నేహా చౌదరికి ఓట్లు వేయమని చెబుతున్న దిగ్గజ క్రికెటర్ లారా