ప్రతిసారి బిగ్ బాస్ అంటే.. కంటెస్టెంట్స్ ఎవరు? ఏయే గేమ్స్ ఆడిపిస్తున్నారు లాంటి ఎగ్జైట్ మెంట్ ఉండేది. కానీ ఈసారి సీజన్ లో మాత్రం అలా ఏం కనిపించట్లేదు. 50 రోజులు అంటే ఆల్మోస్ట్ సగం రోజులు గడిచిపోయాయి గానీ ఏ విషయంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పోటీతత్వం చూపించట్లేదు. ఒక్క గొడవ పడటంలో మినహా. అవును వచ్చిన దగ్గర నుంచి ఒకరిపై ఒకరు అరుస్తూ, కోపాన్ని చూపించడం తప్పితే గేమ్స్ లో ఏ మాత్రం క్రీడాస్పూర్తిగా చూపించట్లేదు. గత వారం బిగ్ బాస్ నిలబెట్టి మరీ తిట్టేసరికి అందరూ లైన్లోకి వస్తారేమోనని వ్యూయర్స్ అభిప్రాయపడ్డారు. కానీ కొంతమేర బెటర్ అనిపించింది తప్పితే పెద్దగా ఏం మారలేదు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గా అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఉంటారు. కానీ ఫిజికల్ టాస్కులు ఆడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే శరీరంపై గట్టిగా దెబ్బలు తగిలే ఛాన్సుంది. అందుకే టాస్కుల విషయంలో బిగ్ బాస్ సేఫ్టీ పాటిస్తుంటాడు. ఈసారి కూడా అలానే చేశాడు. కానీ బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్స్ అయిన గీతూ, రేవంత్ మాత్రం చిన్నపిల్లల్లా గొడవపడ్డారు. తొలుత గీతూని రేవంత్ తోసేయగా, ఆ తర్వాత రేవంత్ ని గీతూ కాలితో తన్నింది. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ కాగా, అందులో ఈ విజువల్ క్లియర్ గా కనిపిస్తోంది.
ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించి ‘ఫుష్ ఫర్ ఫిష్’ అనే గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా తోపుడు బండిని రెండువైపుల నుంచి ఇద్దరిద్దరూ టీమ్ లుగా విడిపోయి తోయాలి. ఎవరైతే బండిని డిఫెండ్ చేయలేకపోతారో వారు ఔటైనట్లు, అలా ఈ టాస్క్ ఫుల్ హాట్ హాట్ గా సాగింది. ఇక ఆ తర్వాత బయట నుంచి హౌసు లోపలికి చేప బొమ్మల్ని విసిరారు. కిందపడిన వాటిని పట్టుకునే క్రమంలో గీతూ, రేవంత్ ఒకే చేప దగ్గరకు వచ్చారు. అప్పుడు రేవంత్ గీతూని తోసేయగా, ఆమె వెళ్లి పక్కన పడిపోయింది. ఆ తర్వాత ఆమె దగ్గర రేవంత్ వెళ్లగా, అతడిని కాలితో తన్నింది. ఇది చూసిన నెటిజన్స్… ఏంట్రా ఈ పిల్లల గొడవ అని కామెంట్స్ చేస్తున్నారు.