‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ కొద్ది రోజులే ఉంది. చివరి రోజుల్లో ఇంట్లోని సభ్యులను టాస్కులతో ఉర్రూతలూగిస్తున్నాడు బిగ్ బాస్. సీన్ రీక్రియేషన్ టాస్కు తర్వాత.. ఇప్పుడు నచ్చిన హీరో/హీరోయిన్ పాత్రలను పోషించే అవకాశం ఇచ్చాడు. ఇంట్లోని సభ్యులు అందరూ తమకు నచ్చిన పాత్రలు ఎంచుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ టైన్మెంట్ అనే పదం వినిపించగానే గుర్తొచ్చే పేరు సన్నీ. ఈ టాస్కులోనూ తన మార్క్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాడు. బాలయ్య గెటప్ లో సన్నీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బాలయ్య అఖండ లుక్ లో పంచ కట్టి డిటో దించేశాడు.
బాలయ్య మేనరిజమే కాకుండా.. బాలయ్యలా మాట్లాడుతూ సన్నీ ఇంట్లోని సభ్యులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కాజల్ ను అయితే రోస్ట్ చేసేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం సన్నీ గెటప్ మీదే టాక్. ప్రేక్షకులు సైతం సన్నీ పర్ఫార్మెన్స్ ను మెచ్చుకుంటున్నారు. రోల్ ప్లే టాస్కు ద్వారా ఇంట్లోని సభ్యులు మొత్తం డబుల్ ఎంటర్ టైన్మెంట్ తో రెచ్చిపోయారు. ఎప్పటిలాగే అందరి కంటే సన్నీనే కాస్త ఎక్కువ హైలెట్ అయ్యాడు. సన్నీ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.