‘బిగ్ బాస్ 5 తెలుగు’ ఆఖరి మజిలీ ఎలా ఉంటుందో అంటూ ఇప్పటి నుంచే అభిమానులు ఊహించుకోవడం మొదలు పెట్టారు. క్రేజీ టాస్కులతో ప్రేక్షకులనే కాదు.. ఇంట్లోని సభ్యులను కూడా ఎంటర్ టైన్ చేస్తున్నాడు. టాస్కు అనగానే సిరి చేసే హంగామా అంతా ఇంతా కాదు. టాస్కుల సమయంలో సిరి యాంకర్ రవిని గుర్తు చేసుకోవడం. మిస్ అవ్వడం చూశాం. ఈ విషయం తెలుసుకుంటే ఆమె రవి గురించి ఎంత ఆలోచిస్తుందో అర్థమవుతుంది. సిరి మంగళవారం నిద్ర లేవగానే ఏడవడం మొదలు పెట్టింది.
ఏంటా అని కాజల్ వెళ్లి ఆరా తీయగా.. రవి కలలోకి వచ్చాడని చెప్పుకొచ్చింది. ఏంటి ఏమైంది అని అడగగా. ‘నువ్వు ఎలిమినేట్ అయ్యాక ఏం జరిగిందో తెలీదు కదా. రా చెప్తాను అని ఐస్ టాస్క్ నుంచి మొత్తం చెప్తున్నాను. అయితే ఒక్కసారిగా అలా మాయమైపోయాడు. నేను ఇంకా రవి అక్కడే ఉన్నాడు అనుకుని చెప్తున్నాను. తర్వాత ప్రియాంక వచ్చింది. ఏమైంది అని అడుగుతూ’ అంటూ తనకు వచ్చిన కల గురించి కాజల్ కు చెప్పుకుంది సిరి. ఆ తర్వాత హౌస్ లో తాను ఒంటరిగా ఐనట్లు ఉందని కామెంట్ చేసింది. రవి మిస్ యూ, మిస్ యూ సో మచ్ అంటూ ఏడ్చేసింది.
ఏదో కొట్టుకుంటోంది. హార్ట్ లో ఏదో ఏదో సంథింగ్. ఎలోన్. ఏంటో తెలీట్లేదు. ఏం తెలియట్లా. మనుషులతో కనెక్షన్స్ ఇంత డేంజరా? గుండె పట్టేసినట్లుంది’ అంటూ తీవ్ర భావోగ్వేదానికి లోనైంది. ఇదిలా ఉండగా.. ఈ విషయాన్ని ట్రోల్ చేసే వాళ్లు కూడా లేకపోలేదు. కొందరు షణ్ముఖ్ అరిస్తే నీకు.. నువ్వు అలిగితే షణ్ముఖ్ కు ఒంటరిగానే ఉంటుందిలే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు సిరి టాస్కులు బాగా ఆడతావ్ అనుకున్నాం. యాక్టింగ్ కూడా బాగానే చేస్తున్నావే అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి సిరికి వచ్చిన కలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.