‘బిగ్ బాస్ 5 తెలుగు’ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. హౌస్ లో అప్పుడే ఇండివిడ్యూవల్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం టికెట్ టూ ఫినాలే టాస్కులతో అందరూ బాగా బిజీగా ఉన్నారు. అయితే ఈ టాస్కుల్లో భాగంగా జరిగిన మొదటి జరిగిన గేమ్ లో శ్రీరామ్, సిరి కాళ్లకు గాయాలైన విషయం తెలిసిందే. బిగ్ బాస్ చెప్పినా వినకుండా ప్రియాంక సింగ్ బామ్ అప్లై చేసి.. హాట్ వాటర్ పోసింది. శ్రీరామ్ కాళ్లు నడవనీకుండా వాపు, నొప్పి ఎక్కువై పోయాయి. వెంటనే బిగ్ బాస్ వైద్యులకు చూపించి ట్రీట్మెంట్ చేయించారు. రెండు కాళ్లకు కట్లు కట్టేశారు. నడిచే పరిస్థితి అయితే లేదు. ఈ సందర్భంలో బయట శ్రీరామ్ కు సపోర్ట్ పెరిగిపోయింది.
సింగర్ శ్రీరామ్ ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్ లో అడుగుపెట్టి పక్కా టాప్-5 అని ముద్ర వేయించుకున్నాడు. బయట కూడా సజ్జనార్ వంటి పెద్దలు, సెలబ్రిటీలు ఎందరో శ్రీరామ్ కు సపోర్ట్ చేస్తున్నారు. శ్రీరామ్ కాళ్లకు కట్లు ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ మద్దతును తెలుపుతున్నారు. శ్రీరామ్ ఫైటింగ్ స్పిరిట్ ను మెచ్చుకుంటున్నారు.
నటి ప్రియ, యానీ మాస్టర్, బిగ్ బాస్ 4 రన్నరప్ అఖిల్ సార్థక్, దీప్తీ సునైనా వంటివారు శ్రీరామ్ కు మద్దతిస్తున్నారు. మరోవైపు టైటిల్ విన్నర్ రేసులో కూడా శ్రీరామచంద్ర పేరు చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. అతను ఎంతో స్ట్రాంగ్ అపోనెంట్ అని ఇంట్లోని సభ్యులు కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. అతను ముఖ్యంగా తన ముక్కు సూటితనంతోనే హౌస్ లో, బయట అభిమానులను పెంచుకున్నాడు. హమీదాతో ట్రాక్ కూడా శ్రీరామ్ కు మంచి గ్రాఫ్ తెచ్చిపెట్టింది. సింగర్ శ్రీరామచంద్ర బిగ్ బాస్ 5 తెలుగు విన్నర్ అవుతాడా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.